BPNL Recruitment 2021: పశుసంవర్ధక శాఖ సంస్థలో భారీ ఉద్యోగ నియామకాలు.. టెన్త్ అర్హత.. ఎలా అప్లై చేసుకోవాలంటే

BPNL Recruitment 2021: పదవ తరగతి ,ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారతీయ పశుపాలనా నిగమ్ లిమిటెడ్ సంస్థ భారీ సంఖ్యలో వివిధ పోస్టుల భర్తీకోసం..

BPNL Recruitment 2021: పశుసంవర్ధక శాఖ సంస్థలో భారీ ఉద్యోగ నియామకాలు.. టెన్త్ అర్హత.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Bpnl Jobs
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 19, 2021 | 3:30 PM

BPNL Recruitment 2021: పదవ తరగతి ,ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.  భారతీయ పశుపాలనా నిగమ్ లిమిటెడ్ సంస్థ భారీ సంఖ్యలో వివిధ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8740 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ ఉద్యోగం గురించి పూర్తి వివాలను నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవడానికి వెబ్ సైట్ ను bharatiyapashupalan.comసందర్శించాలి. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా.. దరఖాస్తులను అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూలై 21 వ తేదీ

ఉద్యోగ వివరాలు :

ఉద్యోగ వివరాలు : ఫీల్డ్ మేనేజర్,  జిల్లా మేనేజర్, తహసీల్ మేనేజర్ విద్యార్హత : పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత భర్తీ చేయనున్న మొత్తం ఖాళీలు : 8740 వయసు : తహసీల్ మేనేజర్ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 40 లోపు ఉండాలి,  ఫీల్డ్ మేనేజర్ కు 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు ఉండవచ్చు. వేతనం : నెలకు రూ. 12, 000-రూ. 18000 ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీల్డ్ మేనేజర్ కు రూ. 944/,  తహసీల్ మేనేజర్: రూ. 708,  ఇతర పోస్ట్లు: రూ. 826 లు చెల్లించాల్సి ఉంది.

భారతదేశంలో పశుసంవర్ధక అభివృద్ధికి బిపిఎన్ఎల్ పనిచేస్తుంది. బిపిఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయం ఇప్పటి వరకు జైపూర్‌లో ఉంది. ఈ శాఖ పశుసంవర్ధక కార్మికులను సిద్ధం చేయడం, పశువులకు సహాయపడే జంతువులు, పశువుల సౌకర్యాలు ,  కృత్రిమ గర్భధారణ వంటి సేవలను అందిస్తారు.

Also Read: Masala Ingredients: పోపుల పెట్టె ఔషధాల గని..మసాలా దినుసులు ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయంటే..