BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

BPCL Recruitment 2021: భారత ప్రభుత్వ రంగానికి చెందిన కేరళలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొచ్చి రిఫైనరీలో వివిధ అప్రెంటిస్‌ పోస్టులను...

BPCL Recruitment: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరు? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Bpcl Recruitment
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 19, 2021 | 9:19 AM

BPCL Recruitment 2021: భారత ప్రభుత్వ రంగానికి చెందిన కేరళలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొచ్చి రిఫైనరీలో వివిధ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 168 ఖాళీలను రిక్రూట్‌ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 168 ఖాళీలకు గాను గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (120), టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌ (48) పోస్టులను భర్తీ చేయనున్నారు. * గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులను కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, సేఫ్టీ, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ ఇంజనీరింగ్‌ విభాగాల్లో తీసుకోనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 01-08-2021 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. * కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 01.08.2021 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అభ్యర్థలను సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * నేషనల్‌ అప్రెంట్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ (నాట్స్‌) పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీగా 20.07.2021 నిర్ణయించారు. * ఇక బీపీసీఎల్‌ ద్వారా దరఖాస్తులకు 25.07.2021 చివరి తేది. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: SSC GD Constable Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలకు అప్లై చేశారా.? దరఖాస్తుల గడువు ముగుస్తోంది.

UGC New Regulations : అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం.. నూతన నిబంధనలను జారీ చేసిన యూజీసీ

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!