Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC New Regulations : అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం.. నూతన నిబంధనలను జారీ చేసిన యూజీసీ

UGC New Regulations : 2021-22 విద్యా సంవత్సరానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) కొత్త నిబంధనలను జారీ చేసింది.

UGC New Regulations : అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం.. నూతన నిబంధనలను జారీ చేసిన యూజీసీ
Ugc New Regulations
Follow us
uppula Raju

|

Updated on: Jul 17, 2021 | 9:48 PM

UGC New Regulations : 2021-22 విద్యా సంవత్సరానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) కొత్త నిబంధనలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలు, కళాశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం, ప్రవేశాలు, పరీక్షలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. అక్టోబర్‌ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని స్పష్టంచేసింది. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా విద్యావ్యవస్థ కుంటుపడింది. పిల్లల చదువులు అస్తవ్యస్తంగా మారాయి. వారి భవిష్యత్‌ని ఊహించుకుంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో యూజీసీ విద్యాసంవత్సరం ప్రకటించడంతో వారికి కొంత ఊరట లభించినట్లయింది. అక్టోబర్‌ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని స్పష్టంచేసింది. ఒకవేళ అర్హత పరీక్షల ఫలితాల వెల్లడిలో ఏదైనా జాప్యం జరిగితే అక్టోబర్‌ 18 నుంచి కచ్చితంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని తెలిపింది.యూజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను సెప్టెంబర్‌ 30 నాటికి పూర్తి చేయాలంది.

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్రాల బోర్డులు 12వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన తర్వాతే యూజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాలని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది. అన్ని బోర్డులకు సంబంధించి 12వ తరగతి పరీక్షా ఫలితాలు జులై 31వరకు విడుదలవుతాయని భావిస్తున్నట్టు పేర్కొంది. విద్యా సంస్థల్లో తరగతులు, పరీక్షల నిర్వహణ, సెమిస్టర్‌ విభజన తదితర అంశాలన్నింటినీ అక్టోబర్‌ 1 నుంచి జులై 31 మధ్య ఉండేలా తగిన ప్రణాళిక సిద్దంచేసుకోవాలని సూచించింది.

కళాశాలల్లో విద్యాబోధన, అభ్యాసన ప్రక్రియ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ లేదా మిశ్రమ పద్ధతుల్లో తప్పనిసరిగా కొనసాగాల్సిందేనని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఎవరైనా అడ్మిషన్‌ రద్దు లేదా మైగ్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి పూర్తి మొత్తాన్ని రిఫండ్‌ చేయాలని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది. కళాశాలల్లో విద్యాబోధన, అభ్యాసన ప్రక్రియ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ లేదా మిశ్రమ పద్ధతుల్లో తప్పనిసరిగా కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది.

Kanipakam: కాణిపాకంలో తెలంగాణ భక్తుల సందడి.. ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయిన స్థానికులు.. అసలు మ్యాటర్ ఏంటంటే..

Exercise: వ్యాయామం అంటే చాలామందికి ఎన్నో అనుమానాలు.. ప్రశ్నలు.. వాటికి సమాధానాలు ఇవిగో!

Plane Crash: జర్మనీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం.. సహాయక చర్యలు చేపట్టిన రిస్క్యూ టీం