Plane Crash: జర్మనీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం.. సహాయక చర్యలు చేపట్టిన రిస్క్యూ టీం
నైరుతి జర్మనీ రాష్ట్రమైన బాడెన్-వుర్టంబెర్గ్‌లోని అడవుల్లో చిన్న విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించారు.
Several die in plane crash in Germany: జర్మనీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న తేలికపాటి విమానం కుప్పకూలింది. స్టుట్‌గార్ట్ విమానాశ్రయం నుంచి శనివారం పొద్దున బయల్దేరిన పైపర్ ఎయిర్‌క్రాప్ట్‌కు చెందిన విమానం ప్రమాదవశాత్తు స్టైనెన్‌బ్రాన్ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. విమానాశ్రయంతో ఎయిర్‌క్రాఫ్ట్ సంబంధాలు తెగిపోయాయి. దీంతో సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీస్తున్నారు. కాగా.. విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాకుండా ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నైరుతి జర్మనీ రాష్ట్రమైన బాడెన్-వుర్టంబెర్గ్‌లోని అడవుల్లో చిన్న విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించారు. జర్మనీలో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణకు బాధ్యత వహించే ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ప్రతినిధి డిఎఫ్ఎస్ ప్రకారం.. ఈ విమానం ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్తుండగా, తూర్పు నగరమైన మాగ్డేబర్గ్ వైపు వెళుతోంది. ప్రమాదానికి ముందు పైలట్ ఎటువంటి అత్యవసర కాల్ పంపలేదని ఆమె చెప్పారు.
శిధిలాలను తొలగిస్తూ.. మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది కృషి చేస్తున్నారు. అప్పటికే ఫ్లైట్ రికార్డర్ దొరికిందని పోలీసులు తెలిపారు. ఈఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.