- Telugu News Photo Gallery World photos These are smallest airports in world form barra airport to tenzing hillary airport
సముద్రం పక్కనే ఎయిర్పోర్ట్.. ప్రపంచంలోని అతి చిన్న విమానాశ్రయాలు ఇవే.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
సాధారణంగా విమానాశ్రయం అంటే చాలా పెద్దగా ఉంటుంది. రన్‌వేతోపాటు.. కార్యాలయం.. చుట్టూ మరే వాహనం రాకుండా.. విశాలమైన ప్రదేశంలో వీటిని ఏర్పాటు చేస్తుంటారు. కానీ అక్కడక్కడ అతి చిన్న విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందామా.
TV9 Telugu Digital Desk | Edited By: Rajitha Chanti
Updated on: Jul 17, 2021 | 8:39 PM

నెదర్లాండ్‌లోని కరేబియన్ ద్వీపం సబా జువాంచో ఇ.య్రాస్క్విన్ విమానాశ్రయం ఉంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న రన్‌వే కలిగి ఉంది. కేవలం 400 మీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే దాదాపు ఒక విమానం పొడవు కంటే కాస్త ఎక్కువ. ఇక్కడి పెద్ద పెద్ద విమానాలను అనుమతించరు. ఇక్కడ విమానాలను నడుపుతున్న ఏకైక విమాయాన సంస్థ విండైర్.

దక్షిణాఫ్రికాలో లెసోత్ ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న ఏకైక విమానాశ్రయం మోషోషూ I విమానాశ్రయం. ఇది అంతర్జాతయ విమానాశ్రయంగా పిలుస్తారు. ఇది దక్షిణాఫ్రికా ఎయిర్‌వేస్ ద్వారా జోహన్నెస్‌బర్గ్‌కు దేశీయేతర విమానాలను మాత్రమే నడుపుతుంది. దీని చిన్న రన్‌వే 1000 మీటర్లు.

స్కాట్లాండ్‌లోని బార్రాస్ ట్రాగ్ మోహర్ (బార్రా విమానాశ్రయం) బీచ్ విమానయాన సేవలను నిర్వహిస్తున్న ప్రపంచంలోని ఏకైక బీచ్ రన్‌వే. ఈ విమానాశ్రయం సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు కొన్ని గంటలు తెరిచి ఉంటుంది. ఈ ప్రాంతంలో వాతావరణం సరిగ్గా లేనందున విమానాల రాకపోకలు, బయలుదేరే సమయాలు కూడా మారుతూ ఉంటాయి.

నేపాల్‌లోని లుక్లాలో ఉన్న టెన్జింగ్-హిల్లరీ విమానాశ్రయం సందర్శకులు ఎవరెస్ట్ శిఖరానికి ట్రెక్కింగ్ చేయడానికి ప్రారంభ బిందువుగా ఎన్నుకుంటారు. ఇక్కడి రన్‌వే చిన్నగా ఉంటుంది. ఇక్కడ విమానాలు టేకాఫ్ , ల్యాండింగ్‌లో పైలట్లు చాలా సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది.

మోర్గాన్‌టౌన్ మునిసిపల్ విమానాశ్రయం ప్రధానంగా సాధారణ విమానయాన ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నగరాన్ని క్లార్క్స్‌బర్గ్, వాషింగ్టన్ DC లోని వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కలుపుతుంది. ఈ విమానాశ్రయం రన్‌వే అర మైలు మాత్రమే. రెస్టారెంట్లో కూర్చుని విమానాలు టేకాఫ్ అవ్వడం చూడవచ్చు.

ప్రపంచంలోని అతి చిన్న విమానాశ్రయాలు ఇవే..





























