Kanipakam: కాణిపాకంలో తెలంగాణ భక్తుల సందడి.. ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయిన స్థానికులు.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Kanipakam Vinayaka Temple: చిత్తూరు జిల్లాలోని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ భక్త బృందం..
Kanipakam Vinayaka Temple: చిత్తూరు జిల్లాలోని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ భక్త బృందం శనివారం నాడు కాణిపాకం పుణ్యక్షేత్రానికి చేరుకుంది. తెలంగాణా భక్తులు కాణిపాకం కు రావడంలో ఎలాంటి విశేషం లేకపోయినా.. వారు వచ్చిన వాహనాలే విశేషంగా నిలిచాయి. వారు వచ్చిన వాహనాలను చూసి అక్కడి ప్రజలు, భక్తులు నోరెళ్లబెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. శనివారం నాడు సినిమా స్టైల్‌లో కొంతమంది మిత్రుల బృందం తెలంగాణ నుంచి పుదుచ్చేరికి, అక్కడ నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనం కోసం చిత్తూరు జిల్లాకు వచ్చారు. అయితే వారు వచ్చింది ఏ కారులోనే.. ట్రావెల్ బస్సులోనే కాదు. కేవలం విదేశాల్లో మాత్రమే లభ్యమైయ్యే హార్లీ డేవిడ్ సన్, బిఎండబ్ల్యు, ఇతర ఫారెన్ కంపెనీలకు చెందిన అత్యంత ఖరీదైన బైక్ లపై వచ్చి సందడి చేశారు. వాటిని ఆలయ పరిధిలో పార్కింగ్ చేసి దైవ దర్శనానికి వెళ్లారు.
అయితే, కాణిపాకంలో నివాసం ఉంటున్న ప్రజలు, దర్శనానికి వచ్చిన భక్తులు ఆ ఫారెన్ మోడల్ బైక్స్ ను ఆసక్తిగా చూశారు. అంతే కాదు వాటిపై కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దాదాపు 12 కొత్త రకమైన వాహనాలను చూసిన స్థానికులు.. వాటి గురించి రకరకాలుగా వారిలో వారే అంచనాలు వేసుకున్నారు. ఒక్కో దాని విలువ సుమారు రూ. 20 లక్షలంటూ ఉంటుందని కొందరంటే.. రూ. 50 లక్షలంటూ మరికొందరు మాట్లాడేసుకున్నారు. ఇదిలాఉంటే.. హైదరాబాద్‌కు చెందిన స్టార్ట్ అప్ కంపెనీ నిర్వాహకుడైన నరసింహ రావు, అతని మిత్ర బృందం హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు, రామేశ్వరం శివాలయం, పుదుచ్చేరి, యాత్రలు ముగించుకొని వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చామని తెలిపారు. కాణిపాకం నుంచి నేరుగా హైదరాబాద్ కు వెళ్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా వీరు ఉన్నంతసేపు.. ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక ప్రజలు వారి బైక్‌లపైనే దృష్టి పెట్టారని చెప్పాలి.
Also read:
Telangana Covid Cases: తెలంగాణలో నిలకడగా నమోదవుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని పాజిటివ్ కేసులంటే..