Farmers: రాజస్థాన్‌లో రైతును తన్ని, కూతుర్ని ఈడ్చుకెళ్లిన అధికారి.. వీడియో వైరల్‌ అవడంతో మారిన సీన్..

Farmers: కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు రెచ్చి పోయి ప్రవర్తిస్తుంటారు.. వాళ్ళ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా సామాన్య ప్రజలపై..

Farmers: రాజస్థాన్‌లో రైతును తన్ని, కూతుర్ని ఈడ్చుకెళ్లిన అధికారి.. వీడియో వైరల్‌ అవడంతో మారిన సీన్..
Farmers
Follow us

|

Updated on: Jul 17, 2021 | 8:58 PM

Farmers: కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు రెచ్చి పోయి ప్రవర్తిస్తుంటారు.. వాళ్ళ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా సామాన్య ప్రజలపై తిరగబడి వాళ్లపై అమాన్యుషంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా రాజస్థాన్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన ఓ అధికారి రైతుల పట్ల దారుణంగా ప్రవర్తించటం తీవ్ర కలకలం రేపుతోంది.

రాజస్థాన్ రాష్ట్రం జలోరి జిల్లాలోని శంఖోర్ గ్రామంలో రైతులకు, అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఓ అధికారి రెచ్చిపోయి రైతును కాలితో తన్నడంతో రైతులకు అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మాలా ప్రాజెక్టులో భాగంగా అధికారులకు, రైతులకు నడుమ వాగ్వాదం జరిగింది. కేంద్రం ఎక్సప్రెస్ హైవే 754 నిర్మిస్తుండగా ఆ పనులను రైతులు అడ్డుకున్నారు. రైతుల తమ భూములకు సరైన నష్ట పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఇదే విషయంపై రైతులు కోర్టుకు వెళ్లారు. తీర్పు వచ్చేవరకు రోడ్డు నిర్మాణ పనులు జరగకూడదని రైతులు ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలోనే జరిగిన వాగ్వాదంలో ఓ అధికారి రైతును కాలితో తన్నడం పెను దుమారం రేపింది. అంతేకాదు.. 15 ఏళ్ల బాలికను బండి వెంట ఈడ్చుకుంటూ వెళ్లి కొంతదూరం వెళ్ళాక వదిలేసాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ ఊరు ప్రజలు గొడవకు దిగారు. చివరికి పోలీసులు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. కాగా, అధికారి ప్రతాపానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ దాడిని తీవ్రంగా భావించిన ప్రభుత్వం.. రైతులపై దాడి చేసిన ఎస్‌డిఎం భూపేంద్ర యాదవ్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. సదరు అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

Video:

Also read:

Viral Video: పెళ్లి వేడుకలో వరుడి కునికిపాట్లు.. వధువు పక్కనే ఉన్నా పట్టించుకోని వైనం.. నెట్టింట్లో మస్తీ వీడియో హల్‌చల్..

Telangana Covid Cases: తెలంగాణలో నిలకడగా నమోదవుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని పాజిటివ్ కేసులంటే..

Station Master: రైల్వే స్టేషన్‌లో తప్పతాగి గుర్రుపెట్టాడు.. వరుసగా ఆగిన రైళ్ళు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Latest Articles
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
చెలరేగిన శ్రేయస్, వెంకటేశ్‌..హైదరాబాద్ చిత్తు.. ఫైనల్‌కు కోల్‌కతా
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
RCBకి శుభవార్త.. ఆ స్టార్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగనున్న RR
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
రక్తంతో కింగ్ కోహ్లీ చిత్ర పటం.. ఫ్రేమ్ కట్టించి మరీ.. ఫొటోస్
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
బైక్‌పై పారిపోతున్న దొంగను లంబోర్గిని కారుతో వెంబడించిన యజమాని
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
‘బ్లడ్‌ శాంపిల్స్ ఇద్దాం’.. ఏపీలో బెంగళూరు రేవ్ పార్టీ నషా..!
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
మీ ఇంట్లో ఏసీ ఉందా?ఈ ట్రిక్స్‌తో విద్యుత్‌ బిల్లు తగ్గించుకోవచ్చు
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
విజృంభించిన స్టార్క్.. కుప్పకూలిన SRH.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు
సుచిత్రపై సీరియస్ లీగల్ నోటీసులు