Viral Video: కళ్లను మైమరిపించే అద్భుత దృశ్యం.. జాలువారుతున్న జలపాతం.. వైరల్ వీడియో.!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Jul 17, 2021 | 8:35 PM

తొలకరి జల్లులతో ప్రకృతిలో ఎటుచూసినా పచ్చదనమే కనువిందు చేస్తోంది. అందమైన ప్రకృతి సోయగాలు, పచ్చటి పర్వతాల హొయలను..

Viral Video: కళ్లను మైమరిపించే అద్భుత దృశ్యం.. జాలువారుతున్న జలపాతం.. వైరల్ వీడియో.!
Hubli Goa

Follow us on

తొలకరి జల్లులతో ప్రకృతిలో ఎటుచూసినా పచ్చదనమే కనువిందు చేస్తోంది. అందమైన ప్రకృతి సోయగాలు, పచ్చటి పర్వతాల హొయలను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఎన్ని కష్టాలెదురైనా ఆ ప్రాంతాలకు వెళ్లి తీరాలనిపిస్తుంది. ఆ అందాలను ఆస్వాదించటంతో, కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇలాంటి అందాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌.. బ్రాగ‌న్జా ఘాట్స్‌లోని హుబ్లీ-గోవా సెక్ష‌న్ అనే చెప్పాలి. అవును.. ఇక్క‌డి ఎత్తైన ఘాట్ల నుంచి జాలువారుతున్న జ‌ల‌పాతాలు స్వ‌ర్గంలోని ఓ భాగ‌మా? అన్న డౌట్‌ రాక మానదు.

ప‌చ్చ‌ని ప్ర‌కృతి ఒడిలో, కురుస్తున్న జోరువాన‌లో తెల్ల‌టి పాల నుర‌గ‌లా.. జాలువారుతున్న జల‌పాతాల‌ను చూసి ప‌ర్యాట‌కులు ప‌ర‌వశించిపోతున్నారు. గోవా-క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దు కొండ ప్రాంతం బ్రాగంజా ఘాట్స్‌లో 26 కిలోమీట‌ర్ల ఘాట్ సెక్ష‌న్ మొత్తం అటవీ ప్రాంతమే. గోవా- క‌ర్ణాట‌క‌, ఇత‌ర ప్రాంతాల‌తో క‌లుపే ఈ మార్గంలో ప్ర‌యాణం.. మ‌ధురానుభూతిని క‌లిగిస్తుంది.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!

చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu