VIRAL VIDEO : సింహాలను ఎదిరించిన ముంగూస్..! ధైర్యం మామూలుగా లేదుగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..
VIRAL VIDEO : సింహాన్ని అడవి రాజుగా పిలుస్తారు. దాని శక్తిని సవాలు చేయడం అంటే ప్రాణాలమీదికి తెచ్చుకోవడమే. అడవిలో ఏ జంతువు

VIRAL VIDEO : సింహాన్ని అడవి రాజుగా పిలుస్తారు. దాని శక్తిని సవాలు చేయడం అంటే ప్రాణాలమీదికి తెచ్చుకోవడమే. అడవిలో ఏ జంతువు ఈ సాహసం చేయదు. దాని గర్జన వింటేనే జంతువులు మొత్తం వణికిపోతాయి. కానీ ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ముంగూస్, పాముల యుద్ధాన్ని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. చిన్నదైన ముంగూస్ పెద్ద పాములను కూడా చంపేస్తుంది. కానీ ఒక ముంగూస్ రెండు సింహాలతో పోరాడటం మీరెప్పుడైనా చూశారా.. లేదంటే వెంటనే ఈ వీడియో చూసేయండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.
ముంగూస్ సింహాలను ధైర్యంతో ఎదిరించడంతో అవి అక్కడి నుంచి పారిపోవడాన్ని మీరు గమనించవచ్చు. ఈ వీడియోలో సింహం తన పాదాలతో ముంగూస్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ముంగూస్ పైకి దూకి నోటిని కొరకడానికి ప్రయత్నిస్తుంటుంది. సింహం పట్టుకోవాలనుకున్నప్పుడు ఎగురుతూ సింహాన్ని వెనకకు వెళ్లేలా చేస్తుంటుంది. వీడియో చివరి వరకు సింహం ముంగూస్ మధ్య పోరాటం కొనసాగుతుంది కానీ చివరకు రెండు సింహాలు ముంగూస్‌ను చూసి భయపడి పారిపోతాయి.
మీరు వీడియో చూడటం ద్వారా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ధైర్యంగా ఉంటే ఎంతటి బలవంతుడినైనా ఎదిరించవచ్చని తెలుసుకోవచ్చు. కొంతమంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతుండగా మరికొందరు దీన్ని చాలా ఇష్టపడుతున్నారు. ఈ షాకింగ్ వీడియోను ఇప్పటి వరకు 70 వేలకు పైగా చూశారు. ఈ వీడియోకు 1100 లైక్‌లు వచ్చాయి. ఇది కాకుండా 191 రీట్వీట్లు చేశారు.
— Nature Is Fucking Lit ? (@fuckingnatures) May 27, 2021