AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెళ్లి వేడుకలో వరుడి కునికిపాట్లు.. వధువు పక్కనే ఉన్నా పట్టించుకోని వైనం.. నెట్టింట్లో మస్తీ వీడియో హల్‌చల్..

Viral Video: చాలామంది ప్రయాణం చేసేటప్పుడు నిద్రపోతుంటారు. ఇంకొంతమంది.. నిద్ర ఆపుకోలేక ఆఫీసుల్లో అదే పని..

Viral Video: పెళ్లి వేడుకలో వరుడి కునికిపాట్లు.. వధువు పక్కనే ఉన్నా పట్టించుకోని వైనం.. నెట్టింట్లో మస్తీ వీడియో హల్‌చల్..
Groom Sleeps
Shiva Prajapati
|

Updated on: Jul 17, 2021 | 8:38 PM

Share

Viral Video: చాలామంది ప్రయాణం చేసేటప్పుడు నిద్రపోతుంటారు. ఇంకొంతమంది.. నిద్ర ఆపుకోలేక ఆఫీసుల్లో అదే పనిచేస్తుంటారు.. ఇదంతా కామన్‌గా ఏదో టైమ్‌లో అందరూ చేసే పనే.. కానీ, పెళ్లిలో పెళ్లి కొడుకే నిద్రపోవడం చూశారా..? తట్టి లేపుతున్నా.. డీప్‌ స్లీప్‌లో ఉండిపోవడం చూశారా..? పెళ్లి కూతురు పక్కనే ఉన్నా మర్చిపోవటం చూశారా..? మొత్తానికి ఈ రేర్‌ సీన్‌ను చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు.

ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తరచూ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పలు వీడియోల్లో వధూవరులు చేసిన పని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని వీడియోల్లో పెళ్లికి వచ్చిన వారు చేసిన అల్లరి పనులు ఫన్ తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రెండింగ్‌లోకి వచ్చిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ వీడియోలో వరుడు పరిస్థితి చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. పెళ్లి రిసెప్షన్‌లో ఏకంగా పెళ్లి కొడుకే నిద్రపోతూ కెమెరా కంటికి చిక్కి అడ్డంగా బుక్కయ్యాడు.

వాస్తవానికి పెళ్లంటే ఎన్నో తతంగాలు ఉంటాయి. అనేక రకాల పూజా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రాత్రీ పగలు నిద్రలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఈ వరుడుకి నిద్ర సరిపోనట్లుంది. అందుకే రిసెప్షన్‌లోనే ఓ కునుకు తీశాడు. అదికాస్తా కెమెరాకు చిక్కడంతో.. ఆ వీడియోను ‘‘Official_niranjanm87’’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. పాపం కునికి పాట్లు పడుతున్న ఆ వరుడు పరిస్థితి చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఓ రేంజ్‌లో కామెంట్లు కురిపిస్తున్నారు. హాయిగా పడుకో గురూ.. ఆ తర్వాత చుక్కలే అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం.. నవ్వులు పూయిస్తున్న ఈ స్లీపింగ్ పెళ్లి కొడుకు వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Telangana Covid Cases: తెలంగాణలో నిలకడగా నమోదవుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని పాజిటివ్ కేసులంటే..

Station Master: రైల్వే స్టేషన్‌లో తప్పతాగి గుర్రుపెట్టాడు.. వరుసగా ఆగిన రైళ్ళు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Astronaut: అంతరిక్షంలో అస్ట్రోనాట్స్‌ ఎలా జీవిస్తారో మీకు తెలుసా? వారేం తింటారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే