Astronaut: అంతరిక్షంలో అస్ట్రోనాట్స్‌ ఎలా జీవిస్తారో మీకు తెలుసా? వారేం తింటారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..

Astronaut: కడుపులో కాసింత తిండి పడితేకానీ ఆత్మరాముడు శాంతించడు.. ఇది మనకే కాదు భూమ్మీద సమస్త జీవులకు ఈ తిప్పలు తప్పవు..

Astronaut: అంతరిక్షంలో అస్ట్రోనాట్స్‌ ఎలా జీవిస్తారో మీకు తెలుసా? వారేం తింటారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..
Astronauts
Follow us
Shiva Prajapati

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 17, 2021 | 6:52 PM

Space: కడుపులో కాసింత తిండి పడితేకానీ ఆత్మరాముడు శాంతించడు.. ఇది మనకే కాదు భూమ్మీద సమస్త జీవులకు ఈ తిప్పలు తప్పవు.. ప్రతి జీవికి ఆహారం అవసరం.. ఆహారంతో పాటు గాలి, నీరు కూడా ఎంతో ముఖ్యం. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా జీవి మనుగడ కష్టం. భూమిపై ఉన్న జీవి పరిస్థితి ఇది అయితే.. మరి అంతరిక్షంలోకి వెళ్లినవారు ఏం తింటారు? కొన్ని నెలల పాటు అక్కడ ఎలా ఉండగలుగుతున్నారు? రోదసిలో ఆకలిదప్పులు ఉండవా? వ్యోమగాములకు ప్రత్యేకమైన ఆహారం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఇలాంటి సందేహాలే అందరికీ కలుగుతున్నాయి. సోషల్‌మీడియాలో అయితే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. రోదసిలో ఉంటున్న ఆస్ట్రోనాట్స్‌ రెగ్యులర్‌ లైఫ్‌ ఎలా ఉంటుందా అని తెగ సెర్చ్‌ చేస్తున్నారట నెటిజన్లు.

అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి అంతగా లేని చోట అసలు ఘనపదార్థాలు తినడం సాధ్యమవుతుందా? ద్రవాలనైనా ఎలా తీసుకోవడం అన్న విషయాలు యూరీ గగారిన్‌ చెప్పేంత వరకు సైంటిస్టులకు తెలియదు.1961లో మొట్టమొదటిసారిగా అంతరిక్ష యాత్ర చేసిన రష్యన్‌ వ్యోమగామి యూరీ గరారిన్‌ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రోదసిలోకి వెళ్లిన తర్వాతి ఏడాది మెర్క్యూరీ అనే అంతరిక్ష మిషన్‌లో జాన్‌ గ్లెన్‌ అనే అమెరికన్‌ వ్యక్తి రోదసిలోకి వెళ్లాడు. అంతరిక్షంలో ఆహారం కూడా తీసుకున్నాడు.

ఇక అంతరిక్షానికి వెళ్లే ఆహార పదార్థాలు ఎన్నో రకాల నియంత్రాణ వ్యవస్థను దాటుకోవాల్సి ఉంటుంది. అందుకే అంతరిక్షంలోకి తీసుకువెళ్లే ఆహారంపై ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఈ పద్దతులు కాదని ఆహారం అంతరిక్ష నౌకలోకి వెళ్లడం అనేది అసాధ్యం. ఫ్రూట్‌ జ్యూస్‌, ఫ్రెష్‌ ఫుడ్స్‌, ఇరాడియేటెడ్‌ మీట్‌, న్యాచురల్‌ ఫామ్‌, రీ హైడ్రెటబుల్‌ ఫుడ్‌, పాలు, కాఫీ టీ మొదలుకుని, చూడటానికి మన చపాతీల్లా ఉండే టార్‌టిలాస్‌ వంటి ఫుడ్‌ను కూడా స్పేస్‌లోకి తీసుకెళ్తుంటారు. అయితే, రిటార్ట్‌ పోచెస్‌ వంటి ఫుడ్‌లో అత్యంత ఆధునికతను ఉపయోగించడం వల్ల స్పేస్‌ ఫుడ్ స్టోరేజ్‌, నిర్వహణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయట.

ఇక భూమి మీద మనం నీటిని తాగినట్లు, అంతరిక్షంలో అస్ట్రోనాట్స్‌ తాగలేరు. గ్రావిటీ లేని కారణంగా ఆ నీరు బుడగలా మరిపోతుంటాయి. అందుకే నీటిని కేవలం స్ట్రా సహాయంతో మాత్రమే తాగుతుంటారు. వ్యోమగాములు ఆహారం విషయంలో నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంతరిక్ష వాతావరణానికి తట్టుకోగల ఆహారం-ఎక్కువగా ధృడమైన ప్యాకెట్లలో ప్యాక్‌ చేస్తారు. రోదసిలోకి తీసుకెళ్లే ఆహారం తక్కువ బరువుగా ఉంటుంది. ఇక వ్యోమగాములు తప్పనిసరిగా అవసరమైన పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట.

అయితే అంతరిక్షంలో కుకీస్‌, బ్రెడ్‌ వంటి ఫుడ్‌కు అనుమతి ఉండదు. ఎందుకంటే.. వీటిని తుంచితే వచ్చే చిన్న చిన్న ముక్కలు నౌకలోని పరికరాల్లో చేరి సమస్యలను సృష్టిస్తాయి. అందువల్ల వీటిని అంతరిక్షంలోకి అనుమతించరట. ఇక ఫ్రూట్స్‌ జ్యూస్‌, నట్స్‌, పన్నీర్‌ బట్టర్‌, చికెన్‌, బీఫ్‌, సీ ఫుడ్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. అయితే వీటన్నింటిని ఓ ప్రత్యేక ప్యాక్‌లో నిల్వ ఉంచుతారు, కొన్ని నెలల పాటు ఇవి పాడవకుండా ఏర్పాటు చేశారు. అయితే అంతరిక్షంలోకి వెళ్లే కొద్ది రోజుల క్రితమే వీటిని రెడీ చేసి, ఆపై ఆ ఫుడ్‌ను చాలా మందితో తినిపించి, వారిని 24గంటల పాటు పరిక్షిస్తారు. ఆ ఆహారం తీసుకున్న వారిలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందు అనుమతించరు.

Also read:

Washington : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకం.. కొనసాగుతున్న ఆపరేషన్.. ఆరేళ్ల చిన్నారి మృతి..

Sanchaita: అశోక్ గజపతి రాజుపై మరోసారి విరుచుకుపడిన సంచయిత.. ట్విట్టర్ వేదికగా హాట్ కామెంట్స్..

Hyderabad: ‘మరో మహిళతో మీ భర్త’ అంటూ ఆమె చెప్పిన ఒక్క మాట.. ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది..

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!