Oldest Whiskey: ప్రపంచంలోనే అతి పురాతనమైన విస్కీ బాటిల్ ధర ఎంత ఉండొచ్చు.. అంచనా వేయగలరా? కచ్చితంగా అసలు ధర చెప్పలేరు..

Oldest Whiskey: ఒక విస్కీ బాటిల్ ఎంత ఖరీదు ఉంటుంది? మన దేశంలో అయితే వేలలలోనే ఉండొచ్చు. విదేశాల్లో రకాన్ని బట్టి మహా అయితే లక్షల్లో ఉండొచ్చు.

Oldest Whiskey: ప్రపంచంలోనే అతి పురాతనమైన విస్కీ బాటిల్ ధర ఎంత ఉండొచ్చు.. అంచనా వేయగలరా? కచ్చితంగా అసలు ధర చెప్పలేరు..
Oldest Whiskey
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: KVD Varma

Updated on: Jul 17, 2021 | 6:20 PM

Oldest Whiskey: ఒక విస్కీ బాటిల్ ఎంత ఖరీదు ఉంటుంది? మన దేశంలో అయితే వేలలలోనే ఉండొచ్చు. విదేశాల్లో రకాన్ని బట్టి మహా అయితే లక్షల్లో ఉండొచ్చు. కానీ, ఒక బాటిల్ విస్కీ ఖరీదు కేవలం కోటి రూపాయలు మీరు నమ్మగలరా? నమ్మలేమని అనకండి.. ఎందుకంటే, ఇది నమ్మాల్సిన నిజం కాబట్టి. ప్రపంచంలోనే అతి పురాతనమైన విస్కీ బాటిల్ జస్ట్.. కోటి రూపాయలకు అమ్ముడుపోయింది. రేటు వింటేనే కిక్ వచ్చేస్తుంది కదూ.. అసలు ఇది ఎక్కడిది.. ఎందుకు ఇంత ధర పలికింది తెలుసుకోవాలనిపిస్తోంది కదా.. మరెందుకాలస్యం.. తెలుసుకుందాం రండి..

ఇంగ్లాండ్ లోని ప్రముఖ వేలం సంస్థ స్కిన్నార్ ఇంక్ ఒక అతి పురాతనమైన విస్కీ బాటిల్ ను వేలం వేసింది. ఈ విస్కీ బాటిల్ పేరు ‘ఓల్డ్ ఇంగ్లెడ్వ్’ . దీనిని 1860లో బాట్లింగ్ చేశారు. కానీ, ఈ బాటిల్ లోని విస్కీ ఈ బాట్లింగ్ సమయం కంటే, కనీశం వందేళ్ళ ముందుదని భావిస్తున్నారు. ఈ విస్కీ బాటిల్ కి ఓ 20 వేల నుంచి 40 వేల డాలర్లు వస్తాయని వేలం సంస్థ భావించి. కానీ, జూన్ 30 తో ముగిసిన వేలంలో ఈ బాటిల్‌ను మిడ్‌టౌన్ మాన్హాటన్ లోని మ్యూజియం-పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీ సుమారు కోటి రూపాయలకు (1,37,000 డాలర్లు) పైగా చెల్లించి దీనిని సొంతం చేసుకుంది. ఈ బాటిల్ వెనుక భాగంలో ఉన్న ఒక లేబుల్ లో ఇలా ఉంది: ‘ఈ బౌర్బన్ బహుశా 1865 కి ముందే తయారు చేయచేసి ఉండవచ్చు. మిస్టర్ జాన్ పియర్‌పాయింట్ మోర్గాన్ గదిలో ఇది కనిపించింది. అతని మరణం తరువాత వారి ఎస్టేట్ నుండి సంపాదించడం జరిగింది’

ఈ విస్కీ బాటిల్ కథ ఏమిటంటే..

దక్షిణ కెరొలిన గవర్నర్ జేమ్స్ బైర్నెస్ 1955 లో పదవీవిరమణ చేశారు. ఈ సమయంలో మూత తీయని ఈ విస్కీ బాటిల్ ను తన స్నేహితుడు, ఆంగ్ల నావికాదళ అధికారి ఫ్రాన్సిస్ డ్రేక్‌కు పంపారు. అతను దానిని మూడు తరాల పాటు భద్రంగా దాచి పెట్టాడు. తరువాత ఇది చేతులు మారి.. మారి మూత తెరవకుండానే ఇప్పుడు మ్యూజియంకు చేరింది. ఈ విస్కీ ఇది 1770 ల విప్లవాత్మక యుద్ధం,1790 ల విస్కీ తిరుగుబాటుల చారిత్రక సందర్భంలో దీనిని ప్రదర్శించినట్టు భావిస్తున్నారు. ఇది బహుశా 1763,1803 మధ్య ఉత్పత్తి అయ్యివుండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. ఈ కాలంలో ఓకే బారెళ్ళలో గ్లాస్ డేమిజోన్స్ (ఇరుకైన మెడతో ఉబ్బెత్తుగా ఉండే సీసాలు) లో నిలవ చేయడం ప్రామాణిక పద్దతిగా ఉండేది. ఇప్పుడు ఈ బాటిల్ కూడా అదే పద్ధతిలో ఉంది.

ఇంతకీ ట్విస్ట్ ఏమిటంటే.. ఇంత ఖరీదు పెట్టి కొన్న ఈ విస్కీ బాటిల్ దాచుకోడానికే గానీ, తాగేందుకు ఏమాత్రం పనికిరాదు. సాధారణంగా మూత తీయకుండా ఉంచిన విస్కీ బాటిల్ లోని విస్కీ పది సంవత్సరాల లోపులోనే ఉపయోగించాలి.

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ మరింత సురక్షితం.. కొత్త అప్‌డేట్ వచ్చింది.. మీ ఎకౌంట్‌ను భద్రంగా ఉంచుకోండి ఇలా!

Facebook Pay: ఇకపై షాపిఫై ఈ కామర్స్ ద్వారా ఫేస్‌బుక్ పే చెల్లింపులు.. ఆన్లైన్ వ్యాపారం కోసం ఫేస్‌బుక్ కొత్త ఏర్పాటు