Facebook Pay: ఇకపై షాపిఫై ఈ కామర్స్ ద్వారా ఫేస్‌బుక్ పే చెల్లింపులు.. ఆన్లైన్ వ్యాపారం కోసం ఫేస్‌బుక్ కొత్త ఏర్పాటు

Facebook Pay: ఇప్పుడు ఫేస్‌బుక్ ఆన్‌లైన్ చెల్లింపు విధానం ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరుగుతుంది. ఫేస్‌బుక్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ షాపిఫైతో ఫేస్‌బుక్ పేను ప్రారంభించనుంది.

Facebook Pay: ఇకపై షాపిఫై ఈ కామర్స్ ద్వారా ఫేస్‌బుక్ పే చెల్లింపులు.. ఆన్లైన్ వ్యాపారం కోసం ఫేస్‌బుక్ కొత్త ఏర్పాటు
Facebook Pay
Follow us

| Edited By: KVD Varma

Updated on: Jul 17, 2021 | 4:24 PM

Facebook Pay: ఇప్పుడు ఫేస్‌బుక్ ఆన్‌లైన్ చెల్లింపు విధానం ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జరుగుతుంది. ఫేస్‌బుక్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ షాపిఫైతో ఫేస్‌బుక్ పేను ప్రారంభించనుంది. దీని ద్వారా, కస్టమర్ తన సొంత వెబ్‌సైట్‌లో చెల్లింపు చేయడం సులభం అవుతుంది. ప్రస్తుతం, ఫేస్‌బుక్ పే సిస్టమ్ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు దాని ప్రధాన ప్లాట్‌ఫాంపై వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఆగస్టు నుంచి అమెరికాలో వ్యాపారం చేయడానికి ఫేస్‌బుక్ పే వ్యవస్థను ఉపయోగిస్తున్న వారు నేరుగా తన వెబ్‌సైట్‌లో చెల్లింపులు చేయవచ్చని కంపెనీ తెలిపింది. దీనివలన వినియోగదారులు ప్రతిసారీ వారి చెల్లింపు వివరాలను అందించాల్సిన అవసరం లేదు. ఇది చెల్లింపు వేగాన్ని పెంచుతుంది. ప్రస్తుతం ఈ విధానాన్ని షాపీ ఫై (Shopify) ద్వారా ఫేస్‌బుక్ అందిస్తోంది. అయితే, భవిష్యత్ లో మరిన్ని చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లు జోడించనున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. డబ్బు పంపడం, షాపింగ్ చేయడం, విరాళం ఇవ్వడం వంటి మరెన్నో సేవల కోసం వినియోగదారులు ఇప్పటికే ఫేస్‌బుక్ యాప్ లో ‘ఫేస్‌బుక్ పే’ను ఉపయోగిస్తున్నారు.

ఫేస్‌బుక్ పే ద్వారా వినియోగదారులకు ఆన్లైన్ చెల్లింపుల కోసం స్నేహపూర్వక వాతావరణం కల్పించడమే తమ లక్ష్యం అని ఫేస్‌బుక్ పేర్కొంది. ఫేస్‌బుక్ పే ద్వారా జరిపే చెల్లింపులు పూర్తి సురక్షితంగా జరుగుతాయని.. దీనికోసం బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ లేదా కార్డుల అవసరం ఉండదని ఫేస్‌బుక్ చెబుతోంది.

షాపిఫై, ఫేస్‌బుక్‌లో తన చెక్అవుట్, చెల్లింపు ప్రాసెసింగ్ సిస్టమ్ ‘షాప్ పే’ను ఫిబ్రవరిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్ గత నెలలో యూఎస్ లో మెసెంజర్ వినియోగదారుల కోసం క్యూఆర్ కోడ్ చెల్లింపు లింక్ ఫీచర్ను ప్రవేశపెట్టింది.

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ మరింత సురక్షితం.. కొత్త అప్‌డేట్ వచ్చింది.. మీ ఎకౌంట్‌ను భద్రంగా ఉంచుకోండి ఇలా!

SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఖాతాదారులు ఆ ఏటీఎమ్‌లకే ఎందుకు వెళ్లాలంటే.. ఎస్‌బీఐలో ఉచితంగా అందిస్తోన్న సేవలు తెలుపుతూ.