AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Cards : క్రెడిట్ కార్డులు ఆన్‌లైన్‌లో తీసుకుంటే చాలా ప్రయోజనాలు..! ఉచిత సేవలతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..

Credit Cards : క్రెడిట్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా బ్యాంకుకు వెళ్లి ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు.

Credit Cards : క్రెడిట్ కార్డులు ఆన్‌లైన్‌లో తీసుకుంటే చాలా ప్రయోజనాలు..! ఉచిత సేవలతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..
Credit Card
uppula Raju
|

Updated on: Jul 17, 2021 | 6:08 PM

Share

Credit Cards : క్రెడిట్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా బ్యాంకుకు వెళ్లి ఆఫ్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే రెండింటి మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే సమయం వృథా అవుతుంది. అంతేకాకుండా పని తొందరగా జరగదు. అదే ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే కార్డు తొందరగా వస్తుంది. ప్రాసెస్ కూడా సులువుగా జరుగుతుంది. ఏదైనా వినియోగదారునికి క్రెడిట్ కార్డు ఇచ్చే ముందు బ్యాంక్ క్రెడిట్ స్కోరును తెలుసుకోవాలనుకుంటుంది. అందుకోసం నెట్ బ్యాంకింగ్ ద్వారా అనేక రకాల సమాచారాన్ని సులభంగా సేకరిస్తాయి. దీనివల్ల క్రెడిట్ కార్డు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తాయి.

ఇవి ఉచిత సౌకర్యాలు బ్యాంకులు ఇచ్చే క్రెడిట్ కార్డులపై వివిధ సౌకర్యాలు కల్పిస్తాయి. ఈ సౌకర్యాలు వివిధ రకాల బ్యాంకులపై ఆధారపడి ఉంటాయి. విభిన్న కార్డులు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకోవాలంటే ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయడం సులభం. రివార్డ్ పాయింట్లు, విమానాశ్రయం లాంజ్ యాక్సెస్, క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ వోచర్లు, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొంచెం ఎక్కువగా డిస్కౌంట్లు లభిస్తాయి. ఎవరైనా సరే వారికి సరైన, చౌకైన, అనుకూలమైన క్రెడిట్ కార్డును కొనుగోలు చేయవచ్చు.

కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు ఉదాహరణకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును తీసుకోండి. ఈ బ్యాంక్ 22 రకాల క్రెడిట్ కార్డులను అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డులు విస్టారా, ఫ్లిప్‌కార్ట్, ఫ్రీచార్జ్, ఇండియన్ ఆయిల్ వంటి సంస్థలతో సంబంధం పెట్టుకొని ఉంటాయి. అంటే ఈ కార్డుల ద్వారా వినియోగదారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పి్స్తారు. ఈ సౌకర్యాలు క్యాష్‌బ్యాక్ నుంచి షాపింగ్ వరకు ఉంటాయి. మీరు రెస్టారెంట్ బిల్లులు, సినిమా టిక్కెట్లపై డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మీరు విద్యుత్, నీరు, టెలిఫోన్ మొదలైనవి చెల్లించాలనుకుంటే క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచిది. ఈ ఖర్చులు భారీగా ఉన్నందున క్యాష్‌బ్యాక్ కూడా ఎక్కువగా ఉంటుంది.

క్రెడిట్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే 45 సెకన్లలో అనుమతి లభిస్తుంది. అదే పని బ్యాంకుకు వెళ్లి చేసుకుంటే ఎక్కువ సమయం పడుతుంది. చేయాల్సిందల్లా బ్యాంక్ పోర్టల్ సందర్శించడం, వారి అర్హతను తనిఖీ చేయడం, క్రెడిట్ కార్డు కోసం ఫారమ్ నింపడం.18 ఏళ్లు పైబడిన వారికి క్రెడిట్ కార్డులు ఇవ్వాలన్న నిబంధన బ్యాంకులకు ఉంది. కొన్ని బ్యాంకులు వేర్వేరు నియమాలను కలిగి ఉండవచ్చు. ఒక అర్హత ఏమిటంటే క్రెడిట్ స్కోరు 750 గా ఉండాలి గతంలో ఎటువంటి రుణం డిఫాల్ట్ అయి ఉండకూడదు.

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు యమ గిరాకీ.. 24గంటల్లోనే లక్ష బుకింగ్స్.. ఆ బైక్‌కు అంత క్రేజ్ ఎందుకంటే..

Fixed Deposits : ఈ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు..

CLAT EXAM -2021 : జూలై 23న క్లాట్ పరీక్ష అడ్మిట్ కార్డులు జారీ.. పరీక్ష మార్గదర్శకాలు విడుదల..