AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fixed Deposits : ఈ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు..

Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో ఐడీబీఐ బ్యాంక్ కొన్ని మార్పులు చేసింది. కొంత మెచ్యూరిటీ కాలానికి సంబంధించి

Fixed Deposits : ఈ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త..! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు..
Rupee
uppula Raju
|

Updated on: Jul 17, 2021 | 5:23 PM

Share

Fixed Deposits : ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో ఐడీబీఐ బ్యాంక్ కొన్ని మార్పులు చేసింది. కొంత మెచ్యూరిటీ కాలానికి సంబంధించి ఈ మార్పు జరిగింది. ఈ కొత్త నిబంధనలు జూలై 14 నుంచి అమల్లోకి వచ్చాయి. 2 కోట్ల కన్నా తక్కువ రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో కొన్ని మార్పులతో ఐడిబిఐ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇప్పుడు ఈ బ్యాంకు ఎఫ్‌డిపై వడ్డీ రేటు 2.7 శాతం నుంచి 4.8 కి చేరుతోంది. 7 రోజుల నుంచి 20 సంవత్సరాల ఎఫ్‌డిలపై 2.7 నుంచి 4.8% చొప్పున వడ్డీ ఇస్తున్నారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రకారం.. ఒక కస్టమర్ 7 -14 రోజులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బు జమ చేస్తే అతనికి 2.7% చొప్పున వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా 31-45 రోజుల ఎఫ్‌డిలో ఈ బ్యాంక్ 2.8% వడ్డీని ఇస్తోంది. 46-90 రోజుల మధ్య పరిపక్వం చెందే ఎఫ్‌డికి 3% చొప్పున వడ్డీ లభిస్తుంది. 91 రోజుల నుంచి 6 నెలల వరకు ఉండే ఎఫ్‌డిలకు ఇప్పుడు 3.5% వడ్డీ లభిస్తుంది.

కొత్త వడ్డీ రేటు ఎంత? 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు స్థిర డిపాజిట్లు చేసిన వారికి ఐడిబిఐ బ్యాంక్ డిపాజిట్ మొత్తంపై 4.3% చొప్పున వడ్డీని ఇస్తోంది. 1 నుంచి 3 సంవత్సరాల మధ్య పరిపక్వత కలిగిన ఎఫ్‌డికి 5.1% వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా 5-10 ఎఫ్‌డిపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 10-20 సంవత్సరాల ఎఫ్‌డిలలో పెట్టుబడులు పెట్టిన వారికి 4.8% చొప్పున వడ్డీ లభిస్తుందని ఐడిబిఐ బ్యాంక్ తెలిపింది. ఇది వడ్డీ అత్యధిక పరిమితి. అదనంగా సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డిలపై ప్రత్యేక 50 బేసిస్ పాయింట్ బెనిఫిట్ ఇస్తున్నట్లు ఐడిబిఐ బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లకు, ఐడిబిఐ బ్యాంక్ 3.2% నుంచి 5.3% వరకు వడ్డీని అందిస్తోంది.

అగ్ర బ్యాంకులు చెల్లించే వడ్డీ దేశంలోని టాప్ 10 బ్యాంకుల గురించి మాట్లాడితే.. స్టేట్ బ్యాంక్ ప్రస్తుతం ఎఫ్‌డిపై 2 కోట్ల వరకు సామాన్య ప్రజలకు 2.90-5.40 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఈ రేటు 3.40-6.20 శాతం. ఐసిఐసిఐ బ్యాంక్ సాధారణ ఎఫ్‌డిపై 2.50-5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3-6.30 శాతం వడ్డీని ఇస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మూడవ స్థానంలో ఉంది ఇది సాధారణ ప్రజలకు 2.50-5.50 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.00-6.25 శాతం వరకు వడ్డీని ఇస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణ ప్రజలకు 3.00-5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50-5.75 శాతం వడ్డీని ఇస్తోంది.

కెనరా బ్యాంక్ సాధారణ ప్రజలకు 2.95-5.50 శాతం వడ్డీని ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 2.95-6.00 శాతం వడ్డీని ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సాధారణ ఎఫ్‌డిపై 2.80-5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.30-6.25 శాతం వడ్డీని ఇస్తోంది. ఐడిఎఫ్‌సి బ్యాంక్ జనరల్ ఎఫ్‌డి ఖాతాపై 2.75-5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25-6.25 శాతం వడ్డీ ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ ప్రజలకు 3.25-5.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75-5.80 శాతం వడ్డీని ఇస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధారణ ప్రజలకు 3.00-5.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50-6.10 శాతం వడ్డీని ఇస్తోంది.

CLAT EXAM -2021 : జూలై 23న క్లాట్ పరీక్ష అడ్మిట్ కార్డులు జారీ.. పరీక్ష మార్గదర్శకాలు విడుదల..

Litchi Fruit Benefits: బరువు ఈజీగా తగ్గాలనుకుంటున్నారా.. ఐతే ఈ పండ్లను తింటే సరి

రిలీజ్ డేట్ కోసం పోటీ పడుతున్న నాని -నాగచైతన్య .. ఒకే రోజు రెండు సినిమాలు..?

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్