రిలీజ్ డేట్ కోసం పోటీ పడుతున్న నాని -నాగచైతన్య .. ఒకే రోజు రెండు సినిమాలు..?

కరోనా కల్లోలం తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే జనాలు దైర్యంగా బయటకు వస్తున్నాయి. పరిశ్రమలన్నీ తిరిగి ప్రారంభం అవుతున్నాయి.

రిలీజ్ డేట్ కోసం పోటీ పడుతున్న నాని -నాగచైతన్య .. ఒకే రోజు రెండు సినిమాలు..?
Nani
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 17, 2021 | 4:51 PM

కరోనా కల్లోలం తగ్గిపోయింది. ఇప్పుడిప్పుడే జనాలు దైర్యంగా బయటకు వస్తున్నాయి. పరిశ్రమలన్నీ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ కూడా పుంజుకుంటుంది. ఇప్పటికే షూటింగ్ లను తిరిగి మొదలుపెట్టేశారు. రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు. థియేటర్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం సినిమాలను రిలీజ్ చేయాలని సిద్ధంగా ఉన్నారు నిర్మాతలంతా. ఇదిలా ఉంటే ఓ రెండు సినిమాలు మాత్రం రిలీజ్ డేట్ కోసం పోటీపడుతున్నాయి. నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ, నాని నటించిన టక్ జగదీష్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. ఆగస్టు 13 కోసం ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయని తెలుస్తున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. లవ్ స్టోరీ విజయం పై చిత్రయూనిట్ అంతా ధీమాగా ఉన్నారు.

మరో వైపు నాని కి నిన్నుకోరి వంటి సూపర్ హిట్ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. రీతువర్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ,పాటలు సినిమా పై అంచనాలను పెంచాయి. అటు లవ్ స్టోరీ… ఇటు టక్ జగదీష్ రెండు సినిమాలు ఒకే డేట్ కోసం పోటీపడుతున్నట్టు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. మరి ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతాయా లేక డేట్స్ మార్చుకుంటాయా అన్నది చూడాలి. ఒకే రోజు విడుదలైతే ఖచ్చితంగా ఆప్రభావం రెండు సినిమాల పైన పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి :

Adi Saikumar: “అమరన్” ప్రారంభించిన ఆది.. తొలిసారి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న హీరో..

Ram Gopal Varma: మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న ఆర్జీవి.. “ఐస్‏క్రీమ్” ఫ్రాంచైజీని తెరకెక్కించనున్న వర్మ ?

Agent Movie: అఖిల్ జోడీగా తమిళ్ బ్యూటీ.. “ఏజెంట్” సినిమా కోసం డైరెక్టర్ భారీ ప్లాన్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!