Suresh Babu: గత అనుభవాలతోనే ఇలా.. వెంకటేష్ చాలా బాధపడ్డాడు..’నారప్ప’ రిలీజ్ పై సురేష్ బాబు ఆసక్తికర కామెంట్స్..

కరోనా ప్రభావం సినీ పరిశ్రమను ఎంతగా దెబ్బతీసిందే తెలిసిన విషయమే. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు అన్ని షూటింగ్స్, విడుదలలు వాయిదా పడ్డాయి. అటు సినీ కార్మికులతోపాటు..

Suresh Babu: గత అనుభవాలతోనే ఇలా.. వెంకటేష్ చాలా బాధపడ్డాడు..'నారప్ప' రిలీజ్ పై సురేష్ బాబు ఆసక్తికర కామెంట్స్..
Suresh Babu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 17, 2021 | 4:37 PM

కరోనా ప్రభావం సినీ పరిశ్రమను ఎంతగా దెబ్బతీసిందే తెలిసిన విషయమే. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు అన్ని షూటింగ్స్, విడుదలలు వాయిదా పడ్డాయి. అటు సినీ కార్మికులతోపాటు.. పలువురు నటీనటులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోన్న సంగతి తెలిసిందే. మొదటి లాక్‏డౌన్ తర్వాత అప్పుడప్పుడే కుదుటపడుతున్న చిత్రపరిశ్రమను కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మరోసారి దెబ్బకొట్టింది. దీంతో మళ్లీ షూటింగ్స్ ఆగిపోవడం.. థియేటర్లు మూతపడడం జరిగింది. ఇక కేసులు తగ్గుముఖం పట్టడం.. లాక్‏డౌన్ ఎత్తివేయడంతో.. తమ సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్. షూటింగ్స్‏ను వెంట వెంటనే కానిచ్చేస్తున్నారు. అయితే అటు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు.. థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని అనుమతి ఇచ్చినా.. ఇప్పటివరకు థియేటర్లు తెరుచుకోలేదు. దీంతో సినిమాలను విడుదల చేయడంలో మేకర్స్ సందేహంలో పడ్డారు. ప్రస్తుత సమయంలో సినిమాలను విడుదల చేస్తే.. అనుకున్నంత బడ్జెట్ వస్తుందా ? అనే డైలామాలో ఉన్నారు. దీంతో మంచి ధర వస్తే.. ఓటీటీలలో విడుదల చేస్తేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు ఇవ్వకూడదని.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక అదే సమయంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన “నారప్ప” సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటన రావడంతో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా సురేష్ బాబు అమెజాన్ ప్రైమ్‏లో జూలై 20న నారప్ప విడుదల కానున్నట్లుగా ప్రకటించారు. దీంతో సురేష్ బాబు వైఖరిపై ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ఓటీటీలో విడుదల చేయడానికి గల కారణాలను చెప్పుకొచ్చారు.

మా సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్‏లో సినిమాలు నా నిర్ణయం మేరకే విడుదలవుతాయి. కానీ నారప్ప మేము మాత్రమే నిర్మించలేదు. నాతోపాటు.. ఎస్.థామస్ కూడా ఈ సినిమాకు నిర్మాత. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాత ఎస్.థామస్ నారప్ప సినిమాను అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకులకు చేరువ చేయాలని భావించారు. కరోనా థార్డ్ వేవ్ దృష్ట్యా ఎవరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాం. ఎగ్జిబిటర్లకు నాపై అసంతృప్తి ఉండడంలో న్యాయం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో థియేటర్‏లో విడుదల చేయడం సరైనది కాదనుకున్నాం. నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేస్తామని చెప్పినప్పుడు వెంకటేష్ కూడా చాలా బాధపడ్డాడు అంటూ చెప్పుకొచ్చారు సురేష్ బాబు..

Also Read: Rakul Preet Singh: లెటేస్ట్ ఫోటో షేర్ చేసిన రకుల్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఇంతకీ అమ్మడు ఏం చేసిందో తెలుసా..

Cinema Theatres: తెలంగాణలో ఈ నెల 23 నుంచి సినిమా థియేటర్ల ఓపెన్.. 100 శాతం ఆక్యుపెన్సితో ప్రారంభం

Rashmika Mandanna: నెట్టింట్లో రష్మిక మందన్న హల్‏చల్.. మరో రికార్డ్ సొంతం చేసుకున్న కన్నడ బ్యూటీ..