Rakul Preet Singh: లేటెస్ట్ ఫోటో షేర్ చేసిన రకుల్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఇంతకీ అమ్మడు ఏం చేసిందో తెలుసా..

సెలబ్రెటీల ఫ్యాషన్‏ను చాలా మంది ఫాలో అవుతుంటారు. హీరోహీరోయిన్స్ వేసుకున్న మోడల్స్ కోసం కొందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక చాలా వరకు సెలబ్రెటీలు కూడా ఏదైనా యూనిక్‏గా ఉండే డిజైనర్

Rakul Preet Singh: లేటెస్ట్ ఫోటో షేర్ చేసిన రకుల్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. ఇంతకీ అమ్మడు ఏం చేసిందో తెలుసా..
Rakul Preet Singh
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 17, 2021 | 4:41 PM

సెలబ్రెటీల ఫ్యాషన్‏ను చాలా మంది ఫాలో అవుతుంటారు. హీరోహీరోయిన్స్ వేసుకున్న మోడల్స్ కోసం కొందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక చాలా వరకు సెలబ్రెటీలు కూడా ఏదైనా యూనిక్‏గా ఉండే డిజైనర్ దుస్తులను ధరించేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక బాలీవుడ్ తారల డిజైనర్ లుక్‎ను టాలీవుడ్ హీరోహీరోయిన్స్ దాదాపు అదే డిజైన్‏తో కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో నెటిజన్స్ కూడా అనేక సార్లు తారలను ట్రోల్ చేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఢిల్లీ క్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నెటిజన్స్‏కు అడ్డంగా దొరికిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ రకుల్ మళ్లీ ఏం చేసింది ? .. ట్రోల్స్ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారా ? అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే.

Rakul

Rakul

“వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్” సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ రకుల్.. ఆ తర్వాత.. టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్‏గా ఎదిగింది. గత కొన్ని రోజులు వరుస హిట్స్ అందుకున్న ఈ చిన్నది.. తర్వాత ప్లాపులతో నెట్టుకొచ్చింది. దీంతో టాలీవుడ్ టూ బాలీవుడ్ అంటూ మకాం మార్చేసింది. తాజాగా రకుల్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల బాలీవుడ్ హీరోయిన్స్ శిల్పా శెట్టి నీలం-తెలుపు ప్రింట్లతో ఉన్న చీరను ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‏చల్ చేశాయి. తాజాగా రకుల్ కూడా ఇంచుమించు అలాగే.. నీలం, తెలుపు ప్రింట్‏లతో ఉన్న ఎంబ్రాయిడరీ సరిహద్దులు కలిగి ఉన్న డిజైనర్ డ్రెస్‏ను ధరించింది. ఇక ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు ఇంటర్నెట్‏లో వైరల్‏గా మారాయి. దీంతో నెటిజన్స్ రకుల్‏ను టార్గెట్ చేశారు. కాపీ క్యాట్.. ఆ డ్రెస్ ఏంటీ .. నీ భంగిమలు ఏంటీ.. శిల్పాశెట్టిని కాపీ కొట్టావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Also Read: Rashmika Mandanna: నెట్టింట్లో రష్మిక మందన్న హల్‏చల్.. మరో రికార్డ్ సొంతం చేసుకున్న కన్నడ బ్యూటీ..

Manish Malhotra: మెగా ఫోన్ పట్టనున్న ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్.. కరణ్ జోహార్ నిర్మాణంలో..