Manish Malhotra: మెగా ఫోన్ పట్టనున్న ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్.. కరణ్ జోహార్ నిర్మాణంలో..

సినీ పరిశ్రమలో చాలా వరకు వివిధ విభాగాల్లో పనిచేసినవారు.. హీరోలుగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా గుర్తింపు తెచ్చుకున్నవారున్నారు. ఇక చాలా మంది డైరెక్టర్‎గా రాణిస్తున్నవారున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్

Manish Malhotra: మెగా ఫోన్ పట్టనున్న ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్.. కరణ్ జోహార్ నిర్మాణంలో..
Manish Malhotra
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 17, 2021 | 2:49 PM

సినీ పరిశ్రమలో చాలా వరకు వివిధ విభాగాల్లో పనిచేసినవారు.. హీరోలుగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా గుర్తింపు తెచ్చుకున్నవారున్నారు. ఇక చాలా మంది డైరెక్టర్‎గా రాణిస్తున్నవారున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇప్పుడు మెగాఫోన్ పట్టబోతున్నారట. బాలీవుడ్ సెలబ్రెటీలందరికి డ్రెసెస్ డిజైన్ చేయడంలో మనీష్ స్టైల్ ఢిపరెంట్. అందుకే ఎంతో మంది సెలబ్రెటీలు ఈయన డిజైన్ చేసే దుస్తులకు ఆసక్తి చూపిస్తుంటారు. బాలీవుడ్ స్టార్స్‏తోపాటు.. వ్యాపారవేత్తలు కూడా ఈయనతో డీలింగ్స్ చేస్తుంటారు. ఇక బాలీవుడ్‏కు చెందిన ప్రముఖుల వివహాది శుభకార్యాలకు కూడా ఈయనను కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తాడు.

ఇప్పటికే బీటౌన్ సెలబ్రెటీలకు సుపరిచితుడైన మనీష్.. ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఫ్యాషన్ డిజైనర్‏గా దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న మనీష్ … దర్శకుడిగా పరిచయం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మంచి లవ్ స్టోరీని సైతం సిద్ధం చేసుకున్నాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‏ను పూర్తి చేసే పనిలో ఉన్నాడట. అయితే మనీష్ తెరకెక్కించబోయే సినిమాను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించబోతున్నట్లుగా సమాచారం. ఇక మనీష్- కరణ్ జోహార్ సంయుక్తంగా తెరకెక్కించే ఈ సినిమాలో స్టార్ హీరోహీరోయిన్స్ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్‏లో టాక్ నడుస్తోంది. యంగ్ హీరో ఒకరు ప్రస్తుతం ఈ సినిమా కోసం సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. అన్ని విషయాలు అతి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈయన్ను స్టైలిస్ట్ గానే చూశాం. కానీ ఇక మీద ఈయనను డైరెక్టర్ గా చూడబోతున్నాం. ఈయన డిజైన్స్ ఎంత అద్బుతంగా ఉంటాయో.. ఈయన చేయబోతున్న సినిమాలు కూడా అంతే అద్బుతంగా ఉంటాయేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  Priya Prakash Varrier: మాస్కో వీధుల్లో మాస్క్ లేకుండా తెగ ఎంజాయ్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్.. ఫోటో గ్యాలెరీ…

Netflix Gaming: మరో కొత్త సేవను పరిచయం చేయనున్న నెట్‌ఫ్లిక్స్‌.. త్వరలోనే అందుబాటులోకి గేమ్‌ స్ట్రీమింగ్‌..