Rashmika Mandanna: నెట్టింట్లో రష్మిక మందన్న హల్‏చల్.. మరో రికార్డ్ సొంతం చేసుకున్న కన్నడ బ్యూటీ..

రష్మిక మందన్న.. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్‏ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. గీత గోవిందం సినిమాతో హిట్ కొట్టింది. ఈ మూవీ తర్వాత తెలుగులో

Rashmika Mandanna: నెట్టింట్లో రష్మిక మందన్న హల్‏చల్.. మరో రికార్డ్ సొంతం చేసుకున్న కన్నడ బ్యూటీ..
Rashmika Mandanna
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 17, 2021 | 3:30 PM

రష్మిక మందన్న.. ప్రస్తుతం టాలీవుడ్‏లో మోస్ట్ వాంటెడ్‏ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. గీత గోవిందం సినిమాతో హిట్ కొట్టింది. ఈ మూవీ తర్వాత తెలుగులో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్, టాలీవుడ్‏లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇదిలా ఉంటే.. అటు సినిమాల్లోనే కాకుండా.. రష్మిక సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‏గానే ఉంటుంది. ఇక తన చిన్ననాటి ఫోటోల నుంచి లెటేస్ట్ ఫోటోలను, వీడియోలను.. వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తూ.. అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా.. అప్పుడప్పుడు లైవ్‏లోకి వస్తూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తుంటారు.

తాజాగా ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రికార్డ్ సాధించింది. రష్మిక తన ఇన్‏స్టాలో ఫాలోవర్స్ సంఖ్య 19 మిలియన్లకు చేరుకుంది. అతి తక్కువ కాలంలోనే ఇంత మంది ఫాలోవర్లను పెంచుకోవడం ఒక్క రష్మికకు మాత్రమే చెల్లింది. మరి ఉండదా.. సోషల్ మీడియాలో ఈ కన్నడ బ్యూటీ చేసే అల్లరి ఆ రెంజ్‏లో ఉంటుంది. ఇటీవల లైవ్‏లోకి వచ్చిన రష్మిక.. తన 19 మిలియన్ల ఫాలోవర్ల విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిక తన లెటేస్ట్ ఫోటోను ఇన్‏స్టాలో షేర్ చేశారు. “నేను కళ్లతో మాట్లాడాలని అనుకుంటున్నాను.. దీనికి మీరు ఎలాంటి క్యాప్షన్ పెట్టాలనుకుంటున్నారు” అని రష్మిక తన ఫాలోవర్లను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో  తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ సరసన “పుష్ప”.. శర్వనంద్ జోడిగా  “ఆడాళ్లూ మీకు జోహార్లు” అనే సినిమాల్లో నటిస్తోంది.

ట్వీట్..

Also Read: Manish Malhotra: మెగా ఫోన్ పట్టనున్న ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్.. కరణ్ జోహార్ నిర్మాణంలో..

Priya Prakash Varrier: మాస్కో వీధుల్లో మాస్క్ లేకుండా తెగ ఎంజాయ్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్.. ఫోటో గ్యాలెరీ…

Devi Sri Prasad: మాట నిలబెట్టుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. ప్రశంసించిన కేటీఆర్.. ట్వీట్స్ వైరల్..