Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devi Sri Prasad: మాట నిలబెట్టుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. ప్రశంసించిన కేటీఆర్.. ట్వీట్స్ వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. కొందరు దీనిని మంచికి ఉపయోగిస్తుంటే.. మరికొందరు ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. అయితే ఇటీవల కొత కొన్ని రోజులుగా స్మార్ట్ ఫోన్స్ కారణంగా..

Devi Sri Prasad: మాట నిలబెట్టుకున్న దేవీ శ్రీ ప్రసాద్.. ప్రశంసించిన కేటీఆర్.. ట్వీట్స్ వైరల్..
Devi Sri Prasad
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 17, 2021 | 3:31 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైంది. కొందరు దీనిని మంచికి ఉపయోగిస్తుంటే.. మరికొందరు ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. అయితే ఇటీవల గత కొన్ని రోజులుగా స్మార్ట్ ఫోన్స్ కారణంగా.. పల్లెల్లో ఉన్న  అద్భుతమైన టాలెంట్‏లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక తమలో ఉన్న టాలెంట్‏ను ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసుకున్నవారు చాలా మందే.. ఇక సింగర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్.. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‏ల మధ్య ఓ గాయని గురించి సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే.

తెలంగాణలోని ఓ గాయని వీడియోని చూసి.. దానిని దేవీ శ్రీ, తమన్ వంటి వారికి ట్యాగ్ చేస్తూ ఇలాంటి ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించండి అంటూ ట్వీట్ చేశారు. దీంతో తమన్, దేవి శ్రీ ప్రసాద్.. కేటీఆర్‏కు స్పందిస్తూ.. తాను చేస్తున్న రాక్ స్టార్ ప్రోగ్రాంలో కచ్చితంగా పాటలు పాడిస్తానని.. ప్రతిభ ఉన్నవారికి ఎప్పుడూ తోడుగా ఉంటామని దేవి శ్రీ మాటిట్చారు.  అయితే మాటల్లోనే కాదు చేతల్లోనూ తాను ముందుంటాను అని దేవీ శ్రీ ప్రసాద్ నిరూపించుకున్నారు. తాజాగా మెదక్ జిల్లాకు చెందిన గాయనిని వెతికి పట్టుకుని మరీ తన షోలో పాట పాడించారు దేవి శ్రీ. ఈ విషయాన్ని కేటీఆర్‏కు ట్యాగ్ చేస్తూ.. మాట నిలెబట్టుకున్నాను అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఆ యువతి ఎంతో అద్భుతంగా పాడుతుందని ప్రశంసలు కురిపించారు. దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చూసిన కేటీఆర్ స్పందిస్తూ.. గొప్ప పని చేశావ్ బ్రదర్ అంటూ పొగిడేశారు.

ట్వీట్..

Also Read: Priya Prakash Varrier: మాస్కో వీధుల్లో మాస్క్ లేకుండా తెగ ఎంజాయ్ చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్.. ఫోటో గ్యాలెరీ…

Netflix Gaming: మరో కొత్త సేవను పరిచయం చేయనున్న నెట్‌ఫ్లిక్స్‌.. త్వరలోనే అందుబాటులోకి గేమ్‌ స్ట్రీమింగ్‌..

Sushmita: ఆ ప్రాంతంలో గడిపిన ప్రతి రోజూ విలువైనదే.. విహార యాత్ర ఫొటోలను షేర్‌ చేసిన చిరు కూతురు. ఆ ప్లేస్‌ ఏంటంటే..