Venkatesh: “నారప్ప” సినిమాకు తీవ్రంగా శ్రమించా.. అయినా ఇలా.. అభిమానులకు క్షమాపలు చెప్పిన వెంకటేశ్..

"నారప్ప" సినిమా విషయంలో చివరకు అభిమానులకు క్షమాపణలు చెప్పారు విక్టరీ వెంకటేశ్. "నారప్ప" విషయంలో అభిమానులందరూ తన నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నట్లుగా తెలిపారు. వెంకటేశ్ ప్రధాన

Venkatesh: నారప్ప సినిమాకు తీవ్రంగా శ్రమించా.. అయినా ఇలా.. అభిమానులకు క్షమాపలు చెప్పిన వెంకటేశ్..
Venkatesh
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 17, 2021 | 7:16 PM

“నారప్ప” సినిమా విషయంలో చివరకు అభిమానులకు క్షమాపణలు చెప్పారు విక్టరీ వెంకటేశ్. “నారప్ప” విషయంలో అభిమానులందరూ తన నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నట్లుగా తెలిపారు. వెంకటేశ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సినిమా “నారప్ప”. తమిళ్‏లో సూపర్ హిట్ సాధించిన “అసురన్” మూవీకి తెలుగు రీమేక్‏గా ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళ్‏లో ప్రధాన పాత్రలో నటించిన ధనుష్ పాత్రలో హీరో వెంకటేశ్ నటించారు. ఇందులో హీరోయిన్‏గా ప్రియమణి నటించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో జూలై 20న విడుదల కానుంది. అయితే ముందు నుంచి థియేటర్‏లో విడుదల కాబోతుంది అనుకున్న అభిమానులకు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో కాస్త నిరాశకు గురయ్యారు. తాజాగా వెంకటేశ్.. నారప్ప సినిమా గురించి మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు.

వెంకటేశ్ మాట్లాడుతూ… నారప్ప సినిమా ఓటీటీలో విడుదల చేయడంతో అభిమానులు అసహనంగా ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తుంది. అభిమానులను బాధపెట్టినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. పరిస్థితులు చక్కబడిన తర్వాత నా తదుపరి చిత్రాలను థియేటర్లలో చూడవచ్చు. నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అలాగే నారప్ప సినిమాలోని పాత్ర చాలా ఛాలెజింగ్ క్యారెక్టర్ అని.. లుక్, ఎమోషనల్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా సవాళ్లతో కూడుకున్నవే అని తెలిపారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో దాదాపు 50 రోజులపాటు అదే డ్రెస్‏లో హోటల్ రూమ్‏లో ఉన్నానని తెలిపారు.

నారప్ప సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: అడుగులు వేయకముందే స్విమ్మింగ్‏ నేర్చుకుంటున్న ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్.. ఇంతకీ ఎవరో తెలుసా..

Pawan Kalyan-Soundarya: మోహన్ బాబు సౌందర్యకు నో చెప్పినా .. బతికిఉండేది అంటున్న కార్తీక దీపం డైరెక్టర్

Gautam Benegal: మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ దర్శకుడు గౌతమ్ బెనెగల్ మృతి..