Income Tax : ఆదాయ పన్ను ఇప్పుడు పోస్టాఫీసు ద్వారా కూడా చెల్లించవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
Income Tax : ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) దాఖలు చేయడం మునుపటి కంటే ఇప్పుడు సులభం అయింది. పన్ను
Income Tax : ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) దాఖలు చేయడం మునుపటి కంటే ఇప్పుడు సులభం అయింది. పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు సమీప పోస్ట్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్ కౌంటర్ నుంచి కూడా ITR ని దాఖలు చేయవచ్చు. ఈ సేవ గురించి పోస్ట్ ఆఫీస్ ఇప్పటికే ప్రకటించింది. మీరు ITR ఆన్‌లైన్‌లో చెల్లించడం ఇబ్బందిగా ఉంటే పోస్టాఫీసు మీకు మంచి ఎంపిక అవుతుంది.
పోస్టాఫీసు ఈ సేవ గురించిన సమాచారం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ‘ఇప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చాలా దూరం వెళ్లవలసిన అవసరం లేదు. మీ సమీప పోస్టాఫీసు CSC కౌంటర్ వద్ద మీరు సులభంగా ఆదాయపు పన్ను రిటర్న్ సేవలను పొందవచ్చు’ అని వెల్లడించింది.
పోస్ట్ ఆఫీస్ సిఎస్సి కౌంటర్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు అనేక సౌకర్యాలను పొందుతున్నారు. పోస్టల్ మాదిరిగా బ్యాంకింగ్, బీమా సంబంధిత అవసరాలు కూడా ఇక్కడ నుంచి జరుగుతున్నాయి. ఇవి కాకుండా డిజిటల్ ఇండియా ప్రోగ్రాం కింద పోస్టాఫీసు ద్వారా అనేక సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మీరు టెక్నాలజీని బాగా ఉపయోగిస్తే మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. మీరు మీ ఇంటి సౌలభ్యం నుంచి మీ ITR ని ఫైల్ చేయవచ్చు. దీని కోసం మీరు ఆదాయపు పన్ను వెబ్‌సైట్ www.incometaxgov.in కు లాగిన్ అవ్వాలి. తరువాత మీరు మీ ITR ని సులభంగా ఫైల్ చేయగలరు.
ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును పొడిగించింది. 2020 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలతో పాటు కంపెనీలకు సైతం రిటర్నుల దాఖలుకు నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది.
अब आयकर रिटर्न जमा करने के लिए दूर जाने की ज़रूरत नहीं है। आप अपने नज़दीकी डाकघर के सीएससी काउंटर पर आसानी से आयकर रिटर्न सेवाओं का लाभ उठा सकते हैं।#AapkaDostIndiaPost pic.twitter.com/afb1sc7GNs
— India Post (@IndiaPostOffice) July 14, 2021