పాకిస్తాన్ లోని ఆఫ్ఘన్ రాయబారి కుమార్తె కిడ్నాప్, టార్చర్..విడుదల.. ఆఫ్ఘనిస్థాన్ ఖండన

పాకిస్తాన్ లోని ఆఫ్గనిస్తాన్ రాయబారి నజీబుల్లా అలిఖిల్ కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి.. టార్చర్ పెట్టి విడుదల చేశారని ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఇస్లామాబాద్ లో ఈ నెల 16 న ఆయన కుమార్తె సిల్ సిలా అలిఖిల్ కిడ్నాప్ కి గురైందని ఆమెను దుండగులు ఎన్నో గంటలపాటు చిత్రహింసలు పెట్టారని వెల్లడించింది. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.., పాక్ లోని ఆఫ్ఘన్ రాయబారులు, దౌత్యాధికారులను, వారి కుటుంబాలను రక్షించేందుకు వెంటనే చర్యలు […]

పాకిస్తాన్ లోని ఆఫ్ఘన్ రాయబారి కుమార్తె కిడ్నాప్, టార్చర్..విడుదల.. ఆఫ్ఘనిస్థాన్ ఖండన
Allah
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 17, 2021 | 7:10 PM

పాకిస్తాన్ లోని ఆఫ్గనిస్తాన్ రాయబారి నజీబుల్లా అలిఖిల్ కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి.. టార్చర్ పెట్టి విడుదల చేశారని ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. ఇస్లామాబాద్ లో ఈ నెల 16 న ఆయన కుమార్తె సిల్ సిలా అలిఖిల్ కిడ్నాప్ కి గురైందని ఆమెను దుండగులు ఎన్నో గంటలపాటు చిత్రహింసలు పెట్టారని వెల్లడించింది. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని.., పాక్ లోని ఆఫ్ఘన్ రాయబారులు, దౌత్యాధికారులను, వారి కుటుంబాలను రక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. సిల్ సిలా ను కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కోరారు. కిడ్నాపర్ల చెరనుంచి విడుదలైన ఈమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది.ఇస్లామాబాద్ లోని బ్లూ ఏరియా నుంచి నిన్న మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్న ఈమెను ఒకటిన్నర గంటల ప్రాంతంలో అపహరించుకుపోయారని, రాత్రి 7 గంటల ప్రాంతంలో విడిచిపుచ్చారని తెలియవచ్చింది. ఆ సమయంలో ఆమె చేతులు, కాళ్ళు కట్టివేసి ఉన్నాయని, ఆమె మణికట్టు, పాదాల మడమలు వాచి ఉన్నట్టు సమాచారం. అలాగే శరీరంపై గాయాల గుర్తులు కూడా ఉన్నట్టు తెలిసింది.

ఈ దారుణ ఘటనపై పాక్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కాగా-తజకిస్థాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్.. పాక్ ను తీవ్రంగా దయ్యబట్టిన సంగతి గమనార్హం. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అయన సైనిక ప్రభుత్వం తమ దేశంలోకి పది వేలమంది జీహాదీలను పంపిందని, పైగా తాలిబన్లతో శాంతి చర్చల విషయంలో పాక్ ఎలాంటి చొరవ తీసుకోలేదని ఆయన ఆరోపించారు.