AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Invention: మాట పడిపోయిన వ్యక్తి భావాలను ప్రపంచానికి చెప్పగలిగే విజయవంతమైన విధానాన్ని ఆవిష్కరించిన వైద్యులు!

Invention: మాటలు రాని వారితో మాట్లాడించగలిగే అద్భుతమైన ఆవిష్కరణను అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది అత్యంత ఆధునిక విధానం.

Invention: మాట పడిపోయిన వ్యక్తి భావాలను ప్రపంచానికి చెప్పగలిగే విజయవంతమైన విధానాన్ని ఆవిష్కరించిన వైద్యులు!
Invention
TV9 Telugu Digital Desk
| Edited By: KVD Varma|

Updated on: Jul 17, 2021 | 7:07 PM

Share

Invention: మాటలు రాని వారితో మాట్లాడించగలిగే అద్భుతమైన ఆవిష్కరణను అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది అత్యంత ఆధునిక విధానం. మాట్లాడలేని మనిషి మెదడును కంప్యూటర్ తో అనుసంధానం చేసి మాట్లాడించే ప్రక్రియ. ఈ విధానాన్ని విజయవంతంగా ఓ వ్యక్తి ద్వారా నిరూపించారు శాస్త్రవేత్తలు. ఇది మెదడుకు సంబంధించిన విజ్ఞాన రంగంలో పెద్ద పురోగతిగా చెప్పుకోవచ్చు. మనిషి మెదడులోకి ఎలక్ట్రోడ్ లను చొప్పించడం ద్వారా ఈ పురోగతి సాధించగలిగారు.

ఎలా..?

అమెరికాలోని శానిఫ్రాన్సిస్కో వైద్యులు ఈ అద్భుతం సాధించారు. ఒక వ్యక్తి 18 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. అప్పటినుంచి అతను మాట్లాడలేక పోతున్నాడు. ఈ వ్యక్తి మెదడు ప్రసంగా ప్రాంతంలోకి డాక్టర్లు ఎలాక్ట్రోడ్స్ మార్పిడి చేశారు. ఆ తరువాత ఆ వ్యక్తి తన మనస్సుతో మాట్లాడాడు. ఇది ఎలా అంటే.. అతను మనసులో అనుకున్నది అంటే మెదడులో భావించిన విషయం కంప్యూటర్ స్క్రీన్ కు ఎలక్ట్రోడ్‌‌లు సంకేతాలు పంపించాయి. ఈ సంకేతాలు కంప్యూటర్ తెరపై పదాలుగా మారాయి. ఈ పరిశోధన ఫలితాలను ”న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్” లో ప్రచురించారు. మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయిన రోగులకు ఇది సహాయపడుతుంది. వైద్యుల బృందం 128 ఎలక్ట్రోడ్ల దీర్ఘచతురస్రాకార షీట్‌ను ఐదుగురి మెదడు ప్రసంగ ప్రాంతంలోకి మార్పిడి చేశారు. నోరు, పెదవులు, దవడ, నాలుకతో కూడిన ప్రసంగ ప్రక్రియల నుండి సంకేతాలను గుర్తించడానికి ఈ షీట్ రూపొందించారు. ఇది కంప్యూటర్‌కు కనెక్ట్ చేశారు.

ఈ పనికి 81 వారాలూ, 50 సెషన్లు పట్టింది. ఇందులో భాగంగా ఐదుగురిని తమ పనికి సంబంధించిన 50 సాధారణ పదాలను మాట్లాడటానికి ప్రయత్నించమని కోరారు. ఈ పదాలలో ఆకలి, సంగీతం, కంప్యూటర్లు ఉన్నాయి. యుఎస్‌లోని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీలో న్యూరాలజీ ప్రొఫెసర్ మెలానియా ఫ్రైడ్ ఇలా చెప్పారు.. ‘ఈ విజయం మనం అనుకున్నదానికన్నా ఎక్కువ.’

ఇంజనీర్ డేవిడ్ మోసెస్ మాట్లాడుతూ.. ”మేము మెదడు కార్యకలాపాలను అనువదించే వ్యవస్థను సృష్టించాము. ఇది సాధారణంగా ఆ వ్యక్తి స్వర మార్గాన్ని నియంత్రిస్తుంది. దీనిని ఇంజనీర్లు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు తయారు చేశారు.” అని చెప్పారు.

Also Read: Netflix Gaming: మరో కొత్త సేవను పరిచయం చేయనున్న నెట్‌ఫ్లిక్స్‌.. త్వరలోనే అందుబాటులోకి గేమ్‌ స్ట్రీమింగ్‌..

SCERT: విద్యార్థులకు ముఖ్య గమనిక: ఎనిమిది వారాల ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌ రిలీజ్