SCERT: విద్యార్థులకు ముఖ్య గమనిక: ఎనిమిది వారాల ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌ రిలీజ్

తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కీలక నిర్ణయం తీసుకుంది..

SCERT: విద్యార్థులకు ముఖ్య గమనిక:  ఎనిమిది వారాల ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌ రిలీజ్
Students
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 17, 2021 | 8:56 AM

SCERT Telangana: తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కీలక నిర్ణయం తీసుకుంది. 2021 – 22 విద్యా సంవత్సరంలో ఎనిమిది వారాల ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌ను శుక్రవారం విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో వర్క్‌షీట్లు సహా పూర్తి వివరాలు పొందుపరిచిందిSCERT తెలంగాణ.

విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను తెలుసుకొనేందుకు 15 రోజులకొక ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. పరీక్షలు.. సిలబస్ లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని https://scert.telangana.gov.in/. ద్వారా తెలుసుకోవచ్చు. ఆగస్టు 16 తర్వాతే కొత్త సిలబస్‌ బోధన జరపాలని, జూలై 31 వరకు బ్రిడ్జి కోర్సును, ఆగస్టులో మొదటి, రెండు వారాలు రెమిడియల్‌ టీచింగ్‌తో పాత పాఠ్యాంశాలబోధన చేయాలని నిర్ణయించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అమ‌ల్లోకి రానున్న నూత‌న విద్యా విధానం.. జ‌రిగే మార్పులు ఇవే..

రాష్ట్రంలో నూత‌న విద్యావిధానాన్ని అమ‌లు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క‌స‌ర‌త్తులు చేస్తోంది. విద్యా విధానంలో స‌మూల మార్పులు తీసుకొచ్చే క్రమంలో జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుస‌రించి రాష్ట్ర ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నూత‌న విధానంలో అమ‌ల్లోకి రానున్న మార్పులు ఈ విధంగా ఉన్నాయి.

* నూత‌న విద్యా విధానంలో భాగంగా ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుంది.

* ఇందులో భాగంగా మూడు రకాల విద్యాసంస్థలు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇక నుంచి ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రిపరేటరీ ఫస్ట్‌క్లాస్, 1వ తరగతి, 2వ తరగతితో ఉంటాయి. వీటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా పిలుస్తారు. వీటి త‌ర్వాత‌.. ప్రిలిమినరీ స్కూళ్లు (3, 4, 5 తరగతులు) ఉంటాయి. అనంతరం మిడిల్‌ స్కూళ్లు (6–8 తరగతులు), ఆపై సెకండరీ స్కూళ్లు (9నుంచి 12 తరగతులు) ఉంటాయి. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయి.

* ఇక ఈ విధానంలో అంగన్‌వాడీ కేంద్రాలను స్కూళ్లలో అనుసంధానమయ్యేలా చేయాలనే ప్ర‌తిపాద‌న ఉంది. ఒకే ప్రాంగ‌ణంలో ఇవి ఉండేలా చూస్తారు. వీటిని ఫౌండేష‌న్ స్కూళ్లుగా ప‌ర‌గ‌ణిస్తారు.

* ఇలా ఏర్పాటు చేసిన ఫౌండేష‌న్ స్కూల్‌లో ఒక ఎస్జీటీ టీచర్‌ ఉంటారు. 1, 2 తరగతులకు బోధన చేస్తారు. ప్రిపరేటరీ–1 క్లాస్‌కు బోధనా సిబ్బందిని వేరేగా ఏర్పాటు చేస్తారు.

* ప్రస్తుతం ప్రాథ‌మిక స్కూళ్లలో ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను ద‌గ్గర‌ల్లోని యూపీ స్కూల్‌ లేదా హైస్కూళ్లకు తరలిస్తారు. 3 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులనే ఇలా తరలింపు చేయాలని సూచించారు.

* ఇలా అద‌నంగా చేరిన విద్యార్థుల‌తో 150 మందికి మించి విద్యార్థుల సంఖ్య పెరిగితే దాన్ని హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తారు.

* 5 కిలోమీటర్ల సమీపంలోని సెకండరీ స్కూళ్లలో ఆయా మాధ్యమాల విద్యార్థుల సంఖ్యను అనుసరించి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా కొనసాగిస్తారు.

* విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులను అనుసరించి సెకండరీ స్కూళ్లలో ఇంటర్మీడియెట్‌ తరగతులను ఏర్పాటు చేస్తారు. అక్కడ 12వ తరగతి వరకు ఉంటుంది. ఇలాంటి స్కూళ్లను గుర్తించాలి. ఇలాంటి వాటిని మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున ఏర్పాటు చేస్తారు.

* ప్రీ ప్రైమరీ, ఫౌండేషనల్, సెకండరీ స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి స్కూల్‌ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేస్తారు.

* ఇక ఇంటికి స‌మీపంలో ప్రీ ప్రైమ‌రీ స్కూళ్లు ఉండేలా చూడాలి. ఫౌండేషన్‌ స్కూలు ఒక కిలోమీటర్‌ పరిధిలో, సెకండరీ స్కూలు 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి.

* టీచర్, విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 1:30, మాధ్యమిక స్థాయిలో 1:35, సెకండరీ స్థాయిలో 1:40 ఉండేలా చూడాలి.

* అయితే ఈ విధానం అందుబాటులోకి తీసుకొచ్చినా ఎక్కడా ఒక్క అంగన్‌వాడీ కేంద్రంగానీ, స్కూలు గానీ మూతపడకూడదు.

* సెకండ‌రీ స్కూళ్లకు సంబంధించి మండలానికి 2 చొప్పున 9నుంచి 12వ తరగతి ఉండేలా ప్రణాళిక రూపొందించి అదనపు తరగతి గదుల నిర్మాణం ఏ మేరకు అవసరమో నిర్ణయించాలి.

Read also: Vijayawada Woman Kidnap: ఆటో డ్రైవర్ తెగువ : విజయవాడలో కలకలం.. కారులో వృద్ధురాలిని కిడ్నాప్ చేసిన దుండగులు