TS POLYCET 2021: నేడు తెలంగాణ పాలీసెట్ ప్రవేశ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
Telangana State Polytechnic Common Entrance Test: తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2021) నేడు జరగనుంది. ఈ పరీక్షకు అధికారులు
Telangana State Polytechnic Common Entrance Test: తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2021) నేడు జరగనుంది. ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ పరీక్షకు లక్ష 2వేల496 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 411 కేంద్రాలలో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు పరీక్ష ఆఫ్‌లైన్ ద్వారా జరగనుంది. అభ్యర్థులకు పది గంటల నుంచే పరీక్ష హాల్‌లోకి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన అనుమతించమని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ర్యాంక్‌ల ద్వారా పాలిటెక్నిక్ కళాశాలలు, బాసర ఐఐఐటీ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు జరగనున్నాయి.
కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. కరోనా నిబంధనలతో పరీక్ష జరుగుతుందని.. విద్యార్థులంతా మాస్కులు ధరించి హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. కాగా.. కరోనా సోకిన అభ్యర్థులకు ఆసుపత్రుల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్ష అనంతరం బాసర ఆర్జీయూకేటీకి ప్రత్యేక మెరిట్ జాబితాలు పంపిస్తామని వెల్లడించారు. వ్యవసాయ, పశువైద్య కోర్సులకు ప్రత్యేక మెరిట్ జాబితాలు రూపొందిస్తామన్నారు. అడ్మిషన్స్ ప్రక్రియ ముగిసిన అనంతరం సెప్టెంబర్ 1 నుంచి పాలిటెక్నిక్ తరగతులు ప్రారంభంకానున్నాయి.
Also Read: