Egg Consumption: గుడ్లు తినేవారికి గుండె జారిపోయే వార్త.. వామ్మో ఇదెక్కడి కొత్త తంటా..
రోజువారీ ఆహారంలో గుడ్లు చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిదే. గుడ్లలో నిండుగా పోషకాలు ఉండటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, తాజాగా జరిగిన ఒక అధ్యయనం గుడ్ల గురించి ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. గుడ్లలో ఉండే లినోలెయిక్ ఆమ్లం క్యాన్సర్‌కు సంబంధం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. దీంతో పాటు మరికొన్ని ఆహారాల లిస్టును కూడా చెప్పారు.

మన శరీరానికి పోషకాలు అందించే లిస్టులో గుడ్లు మొదటి స్థానంలో ఉంటాయి. చాలా మందికి గుడ్లు అంటే చాలా ఇష్టం. గుడ్లు ప్రోటీన్‌కు మంచి మూలం అని అందరూ భావిస్తారు. జిమ్‌లో వ్యాయామం చేసిన తర్వాత చాలా మంది గుడ్లు లేదా ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతారు. వీటితో ఎన్నో రకాల రెసిపీలను చిటికెలో చేసేయొచ్చు. అందుకే వీటని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ తాజా అధ్యయనాలు మాత్రం గుడ్డు ప్రియులకు గుండె పగిలే వార్త చెప్పాయి. వీటి కారణంగా ప్రమాదకర క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు.
తాజా నివేదిక ప్రకారం, గుడ్లు, గింజల నుంచి తీసిన నూనెల్లో లభించే లినోలెయిక్ ఆమ్లం వల్ల ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ చాలా వేగంగా పెరుగుతుందని తాజా అధ్యయనం తేల్చింది. ఇది చాలా ప్రమాదకరమైన రకం క్యాన్సర్. ఈ రకమైన రొమ్ము క్యాన్సర్‌కు ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, హెచ్ ఈ ఆర్2 వంటి గ్రాహకాలు ఉండవు. సాధారణంగా వీటినే చికిత్సలో లక్ష్యాలుగా ఉపయోగిస్తారు. అందువల్ల, ఈ రకం క్యాన్సర్‌కు చికిత్స చేయడం చాలా కష్టం.
లినోలెయిక్ ఆమ్లం, క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధం చాలా ముఖ్యమైనదిగా పరిశోధకులు భావిస్తున్నారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లలో ఈ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలో అధికంగా చేరుతోంది. శరీరంలోని కణాలు, క్యాన్సర్ కణాలు కూడా పెరగడానికి పోషకాలు అవసరం.ఎమ్ టోర్ సీ1 అనే ఒక నెట్‌వర్క్ శరీరంలో పోషకాల లభ్యతను బట్టి కణాల అభివృద్ధిని నియంత్రిస్తుంది.
ఈ అధ్యయనం లినోలెయిక్ ఆమ్లం ఒక రకమైన ఒమేగా-6 అసంతృప్త కొవ్వు అని, ఇది గుడ్లు, సోయాబీన్ నూనె పొద్దుతిరుగుడు నూనెల్లో ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ ఆమ్లం క్యాన్సర్ కు మార్గాన్ని సులభం చేయగలదు. దీని ఫలితంగా, క్యాన్సర్ కణాల పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది.
లినోలెయిక్ ఆమ్లం పనిచేసే విధానం:
లినోలెయిక్ ఆమ్లం ఫాబ్ పి5 అనే ప్రోటీన్‌తో కలిసిపోతుందని పరిశోధనలో తేలింది. ఈ ప్రోటీన్ ట్రిపుల్-నెగటివ్ ట్యూమర్ కణాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫాబ్ పి5 ప్రోటీన్‌తో లినోలెయిక్ ఆమ్లం కలవడం వల్ల ఎమ్ టోర్సి1 మార్గం మరింత చురుకుగా మారుతుంది. దీని కారణంగా క్యాన్సర్ కణాల అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుంది.
పాశ్చాత్య ఆహారాల్లో, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన వేయించిన ఆహార పదార్థాల్లో లినోలెయిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. 1950ల నుండి విత్తన నూనెల వినియోగం పెరగడం వల్ల ఈ ఆమ్లం శరీరంలో ఎక్కువగా చేరుతోంది. దీని కారణంగా క్యాన్సర్ కేసులు పెరిగే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు ఇదివరకే అనుమానించారు.
భవిష్యత్తులో పెరిగే ప్రమాదం:
లినోలెయిక్ ఆమ్లం ఫాబ్ పి5 ప్రోటీన్‌కు బంధించబడి, దీని వల్ల ట్రిపుల్-నెగటివ్ క్యాన్సర్ కణాల అభివృద్ధి వేగవంతం అవుతుంది. శరీరంలో ఇది అధికంగా చేరితే, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే పిజ్జాలు, బర్గర్ లు వంటి పాశ్చాత్య ఆహారాలు తినడం ఇప్పటికైనా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)