AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎన్ని సూపర్ హిట్స్ , బ్లాక్ బస్టర్ మూవీస్ వదులుకున్నాడో తెలుసా.. అవి చేసి ఉంటే కేరీర్ ఏ రేంజ్‌లో ఉండేదంటే..

ప్రస్తుతం పవన్ కళ్యాన్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీ షెడ్యుల్ వల్ల..సెట్స్ మీద ఉన్న సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే సినిమాలో అడుగు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరకు ఎన్నో మంచి కథలు వెళ్ళాయి. ఎందరో దర్శకులు కథలను వినిపించారు. వాటిని వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారు. అలా వదిలేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎన్ని సూపర్ హిట్స్ , బ్లాక్ బస్టర్ మూవీస్ వదులుకున్నాడో తెలుసా.. అవి చేసి ఉంటే కేరీర్ ఏ రేంజ్‌లో ఉండేదంటే..
Pawan Kalyan
Surya Kala
|

Updated on: Apr 04, 2025 | 5:50 PM

Share

సినీరంగంలో చిరంజీవి తమ్ముడిగా అడుగు పెట్టి.. తనదైన శైలిలో తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగు పెట్టి జనసేన పార్టీ స్థాపించి నేడు ఏపీ డిప్యుటీ సిఎం గా తనదైన శైలిలో పాలనలో దూసుకుపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన అందిస్తూ ప్రజల చేత శభాస్ అనిపించుకుంటున్నారు. షూటింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు కాల్షీట్లు కేటాయించలేకపోతున్నారు. అయితే అతి కష్టం మీద హరిహర వీరమల్లు సినిమా పూర్తి అయింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రంగంలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అభిమానుల అభిమాన్ని సొంతం చేసుకున్నారు. అందరి హీరోలకు అభిమానులు ఉంటారు. కానే పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారు. అటువంటి పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలను వివిధ కారణాలతో వదులుకున్నారు.. అవి చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అలా వద్దనుకున్న సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్ ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏమిటంటే

పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బద్రి సినిమాకు ప్రత్యెక స్థానం ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కేరేర్ కు బూస్ట్ ఇచ్చింది. అయితే తర్వాత పూరి జగన్నాథ్ .. పవన్ కళ్యాణ్ కు నాలుగు సినిమా కథలను వినిపించాడట. ఇట్లు శ్రాణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఈ సినిమా కథలను ముందుగా పవన్ కే వినిపించాడట. పవన్ నో అనడంతో రవి తేజ వద్దకు చేరుకున్నాయి. రవి తేజ స్టార్ హీరో గా నిలబెట్టాయి ఈ సినిమాలు. తర్వాత పోకిరీ సినిమా స్టోరీ కూడా ముందుగా పవన్ కే వినిపించాడట పూరీ జగన్నాథ్ అప్పుడు కూడా నో చెప్పడంతో ఆ సినిమా మహేష్ బాబు దగ్గరకు చేరుకుంది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబోలో తెరక్కిన అతడు సినిమా కథను కూడా మొదట పవన్ వద్దకే చేరింది. కథ వింటూ పవన్ నిద్ర పోవడంతో ..నచ్చలేదేమో అనుకుని త్రివిక్రమ్ మహేష్ బాబుతో తెరకెక్కించాడు.

ఇవి కూడా చదవండి

గోలీ మార్, మిరపకాయ్ వంటి సినిమాలతో పాటు .. నేటి తరంలో మేటి సినిమాగా నిలిచిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాని కూడా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేశాడు. మహేష్ బాబు పాత్రకు ముందుగా పవన్ కళ్యాణ్ ను అనుకున్నారు. ఆయన నో చెప్పడంతో వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. పవన్ రిజెక్ట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అనే నమ్మకం కూడా ఒకానొక సమయంలో ఏర్పడింది అని సరదాగా సిని అబిమానులు కామెంట్ చేస్తారు కూడా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.