AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saraswati Pushkaralu: సరస్వతి నదీ పుష్కరాలకు వెళ్లాలనుకునే తెలుగువారికి గుడ్ న్యూస్.. IRCTC తక్కువ ధరకే స్పెషల్ టూర్ ప్యాకేజీ

సనాతన హిందూ ధర్మంలో నదులను దేవతలుగా, దేవతల స్వరూపాలుగా పూజిస్తారు. త్వరలోబృహస్పతి మిథున రాశి లోకి ప్రవేశించనున్నాడు. అప్పుడు సరస్వతి నదీ పుష్కరాలను 12 రోజుల పాటు ఆచరిస్తారు. ఈ పుష్కర సమయంలో సరస్వతి నదిలో పుణ్య స్నానం చేసేందుకు వెళ్లాలనుకునే తెలుగువారి కోసం IRCTC ప్రత్యెక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

Saraswati Pushkaralu: సరస్వతి నదీ పుష్కరాలకు వెళ్లాలనుకునే తెలుగువారికి గుడ్ న్యూస్.. IRCTC తక్కువ ధరకే స్పెషల్ టూర్ ప్యాకేజీ
Saraswati Pushkaralu, Irctc
Surya Kala
|

Updated on: Apr 04, 2025 | 5:03 PM

Share

మన దేశంలో ముఖ్యమైన 12 నదులకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. ఈ పుష్కారాలను 12 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పుష్కర సమయంలో ఆయా నదుల్లో స్నానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది హిందువుల నమ్మకం. మే నెల 15వ తేదీన బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినున్నాడు. ఈ నేపధ్యంలో మే 15వ తేదీ నుంచి సరస్వతీ పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 26 వరకు నిర్వహించనున్నారు.

ఇది అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదికి జరిగే పండుగ. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుందని నమ్మకం. కనుక ఇక్కడ మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకూ సరస్వతి నదీ పుష్కరాలను నిర్వహించనున్నారు. ఈ సరస్వతి పుష్కరాలకు వెళ్ళాలనుకునే తెలుగువారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరి కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ లో సరస్వతి నదీ స్నానం చేయడమే కాదు.. రామయ్య జన్మ భూమి అయోధ్య, శివయ్య కొలువైన క్షేత్రం కాశి సహా అనేక పుణ్య స్థలాలను సందర్శించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీని అయోధ్య- కాశి (వారణాశి) పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

టూర్ వివరాల్లోకి వెళ్తే..

ఇవి కూడా చదవండి

తొమ్మిది రాత్రులు.. పది పగళ్లు సాగే యాత్రను భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. మే 8వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ట్రైన్ తెలంగాణాలోని భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర లలో హాల్ట్ సౌకర్యం ఉంది.. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్‌లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు ఎక్కవచ్చు.. యాత్ర ముగించుకుని అదే స్టేషన్ లో దిగవచ్చు.

ఈ టూర్ లో మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్ – 460 సీట్లు, థర్డ్ ఏసీ- 206 సీట్లు , సెకండ్ ఏసీ- 52 సీట్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉన్నాయి.

ప్యాకేజీలో ఎఎ ప్రదేశాలు దర్శించుకోవచ్చు అంటే

పూరీ, గయ, వారణాశి,అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లో ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు. అంటే

పూరీలో జగన్నాథుడి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయాలను దర్శించుకోవచ్చు.

గయ- విష్ణుపాద ఆలయం

వారణాశి- కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారిని దర్శించుకోవచ్చు గంగాహరతిని చూడవచ్చు.

అయోధ్యలో బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాలను దర్శించవచ్చు. సరయూ నది హారతిలో పాల్గొనవచ్చు.

ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో సరస్వతి నదీ పుష్కర స్నానం ఆచరించవచ్చు.

మొదటి రోజు.. ఈ రైలు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి స్టార్ట్ అవుతుంది.. ఆయా స్టేషన్ లో రెండోరోజు ఉదయం తొమ్మిది గంటలకు పూరీ సమీపంలో మల్తీపత్‌పూర్‌ స్టేషన్‌కి చేరుతుంది. ఇక్కడ దిగి పూరీకి వెళ్లి హోటల్‌లో చెక్‌ ఇన్‌ అయి ఫ్రెష్ అయి లంచ్‌ తర్వాత జగన్నాథ ఆలయాన్ని పూరీ బీచ్ ను చూడవచ్చు. రాత్రి పూరీలోనే బస చేయాల్సి ఉంటుంది. మూడోరోజు బ్రేక్‌ఫాస్ట్‌ చేసి హోటల్‌ గది చెక్‌ అవుట్‌ అయ్యి కోణార్క్‌కు వెళ్లి అక్కడ సూర్య నారాయణుడి ఆలయాన్ని దర్శించుకుని తరవాత మల్తీపత్‌పూర్‌ స్టేషన్‌కి చేరి రైలెక్కాలి. నాల్గోరోజు ఉదయం తొమ్మిదిన్నరకు గయకు చేరుతుంది. బొద్ గయలో హోటల్‌ కి వెళ్లి రిఫ్రెష్‌ అయిన తర్వాత లంచ్‌ చేసి విష్ణుపాద ఆలయదర్శనం చేసుకోవాలి. రాత్రి బోద్‌ గయలోనే బస చేయాల్సి ఉంటుంది. ఐదోరోజు ఉదయం అల్పాహారం తిని గయ స్టేషన్‌లో రైలెక్కాలి.. మధ్యాహ్నం ఒంటిగంటకు వారణాసికి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన సారనాథ్‌కు వెళ్లాలి. ఇక్కడ బౌద్దుది జ్ఞానోదయం అయిన ప్రదేశాలు చూసి ఇక్కడే బస చేయాలి. ఆరోరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత కాశీ కి ప్రయాణం అవ్వాలి. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాల దర్శనం సాయంత్రం గంగా హారతి తర్వాత రాత్రి బస వారణాసిలో బస చేయాల్సి ఉంటుంది. ఏడోరోజు ఉదయం వారణాసిలో గది చెక్‌ అవుట్‌ చేసి అయోధ్యకు ప్రయాణం అవ్వాలి. మధ్యాహ్నం 12.30కు అయోధ్యధామ్‌ స్టేషన్‌కు చేరుతుంది. రామజన్మభూమి, హనుమాన్‌గరి దర్శనం, సాయంత్రం సరయు నదిలో హారతిని వీక్షించి రాత్రి భోజనం చేసి అయోధ్యధామ్‌ స్టేషన్‌కు నుంచి ట్రైన్ ద్వారా ప్రయాగ్‌రాజ్‌కి చేరుకోవాలి. ఎనిమిదో రోజు తెల్లవారు జామున రైలు ప్రయాగసంగమం రైల్వేస్టేషన్‌కి చేరుతుంది. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేయడంతో టూర్ ముగుస్తుంది. తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది.

ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్ ని ఎంచుకునే ఒక్కొక్కరికి రూ.16,800 రూపాయలు

పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికీ రూ. 15,700

స్టాండర్డ్ కేటగిరీ (థర్డ్ ఏసీ)

పెద్దలకు రూ 26,600,

పిల్లలకు రూ 25,300

కంఫర్ట్ కేటగిరీ (సెకండ్ ఏసీ)

పెద్దలకు రూ. 34,900,

పిల్లలు రూ 33,300 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్  పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG41  వెబ్‌సైట్‌ని సందర్శించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..