AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin B12: శాఖాహారులా..విటమిన్ బి12 లోపంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ డ్రై ఫ్రూట్స్ వాటర్‌ని డైట్‌లో చేర్చుకోండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం

శరీరంలోని నరాల కణాలు, రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ఒక ముఖ్యమైన పోషకం విటమిన్ B12. ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన పోషకమైన విటమిన్ బి12 స్థాయి శరీరంలో తగ్గినప్పుడు.. అది ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కనుక శరీరంలో ఈ లోపాన్ని ఎలా అధిగమించాలో నిపుణులు కొన్ని సలహాలు చెప్పారు. ప్రతి సమస్యకు మేడిసిన్స్ కంటే ముందుగా సరైన ఆహారం తీసుకోవడం అని చెబుతున్నారు. కనుక విటమిన్ B12 లోపిస్తే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వాటర్ తాగడం మేలు చేస్తుందని అంటున్నారు.

Vitamin B12: శాఖాహారులా..విటమిన్ బి12 లోపంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ డ్రై ఫ్రూట్స్ వాటర్‌ని డైట్‌లో చేర్చుకోండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం
Vitamin B12
Surya Kala
|

Updated on: Apr 04, 2025 | 3:36 PM

Share

విటమిన్ బి12 శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది ప్రత్యేకంగా నాడీ వ్యవస్థ, రక్త కణాలు , DNA లను సృష్టించడానికి పనిచేస్తుంది. విటమిన్ బి12 లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. వీటిలో బలహీనత, అలసట, మానసిక సమస్యలు, కండరాల నొప్పి వంటి సమస్యలు ఉన్నాయి. శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవాలని పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ అంటున్నారు. విటమిన్ బి12 లభించే వాటిలో ఎక్కువ భాగం మాంసాహారంలోనే ఉంటాయి. కనుక శాహారులకు ఈ విటమిన్ దొరకడం కొంచెం కష్టం.. కనుక శాఖాహారులు తాము తినే ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ వాటర్ తాగడం వల్ల శరీరంలో ఈ విటమిన్ లోపం ఉండదని నిపుణులు అంటున్నారు.

మీరు ఏ డ్రై ఫ్రూట్స్ నీరు త్రాగాలంటే

బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్, అంజీర్‌లను రాత్రంతా నానబెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రై ఫ్రూట్స్ నీరు త్రాగడం వల్ల శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని నివారించవచ్చు. కనుక ఈ మిక్సిడ్ డ్రై ఫ్రూట్స్ వాటర్ ను డైట్ లో ఎలా చేర్చుకోవాలో తెలుసుకుందాం.

ముందుగా బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్, అంజీర్‌లను కడిగి ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి.

ఇవి కూడా చదవండి

ఉదయం నానబెట్టిన ఈ పండ్లను నీటిలో నుంచి బయటకు తీయండి.

ఇప్పుడు బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్‌నట్, అంజీర్‌లు నానబెట్టిన నీటిని ఫిల్టర్ చేయండి.

ఈ నీటిని గోరువెచ్చగా త్రాగండి. మీకు కావాలంటే రుచిని పెంచడానికి ఈ నీటిలో ఒక స్పూన్ తేనె జోడించవచ్చు.

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. బలహీనత తొలగిపోతుంది.

డ్రై ఫ్రూట్స్ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వీటిల్లో సహజ చక్కెర ఉండటం వల్ల, అవి శరీరంలో తక్షణ శక్తిని పెంచడానికి పనిచేస్తాయి. చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో డ్రై ఫ్రూట్స్ తినడం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..