Chanakya Niti: ఈ లక్షణాలున్నవారు జీవితంలో ధనవంతులు కాలేరన్న ఆచార్య చాణక్య
ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం నేటి తరం యువతకు అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. మనిషి జీవిత విధానం గురించి ఎన్నో విషయాలను తెలియజేశాడు. భార్యాభర్తల మధ్య బంధం నుంచి కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన లక్షణాలు.. డబ్బుల సంపాదన, డబ్బు ఖర్చు వంటి అనేక విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే ఎవరైనా సక్సెస్ ను సొంతం చేసుకోవచ్చు. అయితే డబ్బుల సంపాదన .. ఖర్చు విషయంలో కూడా విషయాలను గురించి తన నీతి శాస్త్రంలో ఆయన ఎన్నో సూచనలు చేశారు అవి ఏమిటంటే..

పేదరికంలో జీవించాలని ఎవరూ కోరుకోరు. తమ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. అవకాశం వస్తే రాత్రికి రాత్రే కోట్లకు పడగెత్తాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే వస్తుంది. పేదవారు కూడా కోట్లు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అయితే మరికొందరు ఎంత ప్రయత్నించినా సరే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పేదరికంలోనే జీవిస్తారు. అయితే కొన్ని లక్షణాలు ఉన్నవారు ఎంత ప్రయత్నం చేసినా సరే జీవితంలో ధనవంతులు కాలేరని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. తమ జీవితాన్ని పేదరికంతోనే గడపాల్సి ఉంటుందని చెప్పారు. ఈ రోజు చాణక్య చెప్పిన ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..
డబ్బులను ఇంట్లోనే దాచుకునేవారు: తాము కష్టపడి సంపాదించిన డబ్బులను కొంతమంది ఇంట్లోనే దాచుకుంటారు. ఇలా చేయడం వలన వారి ఆర్ధిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంటుందని చెప్పాడు చాణక్య. డబ్బులు దాచుకునే బదులుగా దేనిలోనైనా పెట్టుబడిగా పెట్టమని చెబుతున్నాడు. అలాగని దేనిలో పడితే దానిలో పెట్టకూడదని.. వీలయితే భూమి మీద పెట్టుబడి పెట్టమని సుచిస్తున్నాడు.
అక్రమంగా సంపాదించే వారు: కొంత మంది తమ ఆర్ధిక స్థితి మెరుగుపరచుకోవడం కోసం ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలని కోరుకుంటారు. అందుకోసం తప్పుడు దారిలో వెళ్ళడానికి కూడా వెనుకాడరు. అక్రమార్జన చేసేవారు మొదట్లో డబ్బులు బాగా సంపాదించవచ్చు. అయితే కాలక్రమంలో అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బుల గురించి తెలిస్తే.. ఆ డబ్బులు నిలవదు సరికదా.. సమాజంలో తలదించుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు.
అతిగా దానం చేసే గుణం: దానం చేసే గుణం మంచిది. పుణ్య కార్యం .. అయితే అతిగా దానం చేయడం ముఖ్యంగా.. శక్తికి మించి దానం చేయడం అనర్ధాన్ని కలిగిస్తుంది. కనుక వచ్చే ఆదాయం బట్టి దానం చేయాలి. లేదంటే మీరు వేరెవారు దానం చేస్తే తీసుకునే స్టేజ్ కు చేరుకుంటారు.
సోమరితనం, బద్దకం: సంపాదన ఎంత ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా సరే సోమరితనం ఉండరాదు. ఏ పని చేయకుండా ఉన్న డబ్బులను ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు చేయడం ఆర్ధిక ఇబ్బందులను కలిగిస్తుంది. బద్దకంగా జీవించేవారు ఆర్ధిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది.
అనవసరపు ఖర్చులు: జీవితంలో సంపాదించడం ఎంత ముఖ్యమో.. సంపాదించ దానిని సరైన పద్దతిలో ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యం. చేసే ఖర్చులే మీ ఆర్దిక పరిస్థితికి భరోసా.. డబ్బులు ఉన్నాయి కదా అని అనవసరపు ఖర్చులు చేస్తే అవసరం అయినప్పుడు డబ్బులకు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చాణక్య చెప్పారు.
అహంకారం: కొంతమందికి చేతికి అనుకోని విధంగా డబ్బులు వస్తే.. నెల విడిచి సాము చేస్తారు. తమకంటే గొప్పవారు ఇలలో లేరు అన్నచందంగా ప్రవర్తిస్తారు. గర్వం, అహంకారం పెరిగిపోతుంది. దీంతో మనసు అదుపు తప్పి.. పనిలో ప్రభావం పడుతుంది. అప్పుడు ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకునే సందర్భాలు కూడా ఏర్పడతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








