Rain Alert: తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఇవాళ ఒక్కరోజు జాగ్రత్త.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ చూశారా..?
తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచుతున్నాయి.. ఈ క్రమంలోనే.. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రమంతటా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచుతున్నాయి.. ఈ క్రమంలోనే.. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రమంతటా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అధికారుల అంచనా వేశారు. హైదరాబాద్లో కూడా ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ రోజు ఎక్కువగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని IMD వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గురువారం తెలంగాణలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. జన జీవనం అస్తవ్యవస్తంగా మారింది. మిర్చి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పంట నష్టం ఎక్కువ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నారు. ఇటు భారీ వర్షానికి హైదరాబాద్ కూడా అతలాకుతలం అయింది.. అన్ని డివిజన్లలో భారీ వర్షపాతం నమోదయింది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. సర్కిల్స్, రైల్వే అండర్ బ్రిడ్జిలు, లోతట్టు ప్రాంతాల వద్ద వరద నీరు చేరి ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షానికి ఊడిపడిన చార్మినార్ పెచ్చులు
భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు రంగంలోకి దిగి.. సహయక చర్యలు చేపట్టాయి. మండే ఎండల నుంచి రిలీఫ్ అనిపించినా.. వరుణుడు ఈ రకంగా విధ్వంసం సృష్టించడంతో.. నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. కాగా ఏప్రిల్ 5, 2025 నుంచి మళ్ళీ ఎప్పటిలానే పొడి వాతావారణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్ళీ అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
