Telangana: మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హైకోర్టు కీలక ఆదేశాలు..!
ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు గురువారం(ఏప్రిల్ 3) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తే సహించేదీ లేదని పేర్కొంది. 2023-2026 విద్యా సంవత్సరానికి చెందిన పీజీ మెడికల్ విద్యార్థుల నుంచి పూర్తి ఫీజును కట్టేలా ఒత్తిడి చేయకుండా ఆదేశాలు ఇచ్చింది.

ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు గురువారం(ఏప్రిల్ 3) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తే సహించేదీ లేదని పేర్కొంది. 2023-2026 విద్యా సంవత్సరానికి చెందిన పీజీ మెడికల్ విద్యార్థుల నుంచి పూర్తి ఫీజును కట్టేలా ఒత్తిడి చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. తుది విచారణ పూర్తయ్యే వరకు విద్యార్థులను తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఫీజు నియంత్రణ సంస్థ పెంచిన ఫీజులతో బాధపడుతున్న అనేక మంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తులు ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుకా యారా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపింది. అనంతరం ఈ ఆదేశాలను ఇచ్చింది.
విద్యార్థుల తరఫున న్యాయవాది ఎస్. రవి, సనా సందీప్ రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కాలేజీలు వాటిని పాటించడం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మేనేజ్‌మెంట్ కోటా తోపాటు కన్వీనర్ కోటా ఫీజులను ₹5.8 లక్షల నుంచి ₹24 లక్షల వరకు పెంచిన తర్వాత, హైకోర్టు కాలేజీలను పెరిగిన మొత్తం లో 50% మాత్రమే వసూలు చేయాలని గత విచారణలో భాగంగా హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత, కోర్టు బ్లాక్ పీరియడ్‌లో తదుపరి సంవత్సరాలకు 60-70% ఫీజును అనుమతించింది.
అయితే, మెడికల్ కాలేజీలు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా విద్యార్థులను తరగతులకు హాజరయ్యేందుకు అడ్డుపడుతున్నాయి. మొత్తం ఫీజు చెల్లించాకే తరగతులకు అనుమతి ఇస్తామని హుకుం జారీ చేశాయి. కోర్టు తాత్కాలిక ఆదేశాలున్నా కూడా, విద్యార్థుల నుంచి పూర్తి ఫీజు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో కోర్టులో కంటెంట్ పిటిషన్‌ను విద్యార్థులు దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది. అప్పటివరకు విద్యార్థులను తరగతి గదులకు అనుమతించాలని న్యాయమూర్తుల ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..