సీబీఐ దర్యాప్తులో కొత్త కోణం.. ఇన్‌కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అధికారుల అరెస్ట్..!
CBI దర్యాప్తు ఫలితంగా ఐదుగురు ఐటీ అధికారులు, ఒక చార్టెడ్ అకౌంటెంట్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అదనంగా, RGIA కస్టమ్స్ అధికారులు కూడా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి లంచాలు తీసుకున్నట్లు తేలింది. GST అధికారులు కూడా వివిధ ప్రాంతాలలో వ్యాపారుల వద్ద లంచం కోసం ఒత్తిడి చేసినట్లు నిర్ధారణ అయింది.

తెలంగాణలో 9 నెలలుగా సాగుతున్న సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదుగురు ఆదాయపు పన్ను (IT) అధికారులు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ లంచం తీసుకుంటూ సీబీఐ వలలో చిక్కారు. ఈ ఐటీ అధికారులు పన్ను చెల్లింపుదారుల వద్ద లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఈ ఐటీ అధికారులపై కేసు నమోదు చేసింది. బాధితులపై కేసు నమోదు చేసి వారిపై పన్ను ఎగవేత కేసులను తప్పించేందుకు ఐటీ అధికారులు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
సీబీఐ దాడులలో ఐటీ అధికారులు లంచం తీసుకున్న పత్రాలు, ఆధారాలు బయటపడ్డాయి. మరో కేసులో RGIA కస్టమ్స్ అధికారులుగా పనిచేస్తున్న వినయ్ కుమార్, ముఖేష్ కుమార్‌పై కేసులు నమోదు చేశారు సీబీఐ అధికారులు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి లంచాలు తీసుకున్నట్లు వారిపై సీబీఐ అభియోగం మోపింది. ఇక మరో కేసులో వి.డి.ఆనంద్ కుమార్, మనీష్ శర్మ అనే GST అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. అక్రమంగా GST విధించేందుకు వ్యాపారుల వద్ద లంచాలు తీసుకున్నట్లు వీరిద్దరిపై ఆరోపణలు వచ్చాయి.
హైదరాబాద్‌కు చెందిన ఆనంద్ రామసామి అనే ఉద్యోగి ఐటీ అధికారుల అక్రమ గతివిధానాల గురించి సీబీఐకి ఫిర్యాదు చేశాడు. అతను తన పన్ను రిటర్నులను సమర్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా తన పన్ను ఫైల్ చేయించిన తర్వాత కూడా, ఐటీ అధికారి అతని పత్రాలను అంగీకరించకుండా లంచం కోసం ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుతో సీబీఐ దర్యాప్తు ప్రారంభించగా, ఐటీ అధికారులు పన్ను మినహాయింపుల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టమైంది. ఆనంద్ రామసామి సంబంధిత పత్రాలను పోస్ట్ ద్వారా పంపిన తర్వాత, ఐటీ అధికారులు అతనిపై ఒత్తిడి పెంచారు. దీనిపై అతను మళ్లీ ఫిర్యాదు చేయగా, జూన్ 3, 2024న సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ దర్యాప్తు ఫలితంగా ఐదుగురు ఐటీ అధికారులు, ఒక చార్టెడ్ అకౌంటెంట్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అదనంగా, RGIA కస్టమ్స్ అధికారులు కూడా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి లంచాలు తీసుకున్నట్లు తేలింది. GST అధికారులు కూడా వివిధ ప్రాంతాలలో వ్యాపారుల వద్ద లంచం కోసం ఒత్తిడి చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులపై సీబీఐ పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..