Telangana Road Accidents: తెలంగాణలో రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం..
Telangana Road Accidents: తెలంగాణలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు
Telangana Road Accidents: తెలంగాణలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న వ్యాన్, ట్రాక్టర్ ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు మరణించారు. కాగా.. ట్రాక్టర్ డ్రైవర్ అంకొలి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు గురించి తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. శనివారం ఉదయం కూలి పనికి వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిని మహారాష్ట్రకు చెందిన సందీప్ (18), వెంకట్ పవార్ (15)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: