AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన కిలాడి లేడీ.. పోలీసుల అదుపులో మహిళ

రోజురోజుకు నేరాలు, సైబర్‌ నేరాలు, ఇతర ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామనో.. లేక ఆన్‌లైన్‌ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం సంపాదించుకోవచ్చనే..

హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన కిలాడి లేడీ.. పోలీసుల అదుపులో మహిళ
Subhash Goud
|

Updated on: Jul 17, 2021 | 7:38 AM

Share

రోజురోజుకు నేరాలు, సైబర్‌ నేరాలు, ఇతర ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామనో.. లేక ఆన్‌లైన్‌ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం సంపాదించుకోవచ్చనే.. బ్యాంకు నుంచి ఫోన్లు చేస్తున్నామంటూ ఇలా రకరకాల మోసాలు పెరిగిపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక తాజాగా హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ ముగ్గురు మహిళల నుంచి రూ.1.8 లక్షలు వసూలు చేసి కేసుల పాలైంది. మహిళపై కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. అయితే కిలాడి మహిళ తాను హైకోర్టులో ఓ జడ్జి వద్ద పని చేస్తున్నానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇతర మహిళలకు చెప్పి డబ్బులు వసూలు చేసింది. హైకోర్టులో కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని డబ్బులు ఇస్తే మీకు ఉద్యోగాలు రావడం ఖాయమంటూ మాయమాటలతో వారిని నమ్మించింది. ఇక ఉద్యోగం వస్తుందనే ఆశలో డబ్బులు ఇవ్వగా, తీరా ఉద్యోగం రాకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కిలాడి లేడీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.

అలాగే హైదరాబాద్‌లో కూడా ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎయిర్‎పోర్ట్‎లో ఉద్యోగం ఇప్పిస్తామని యువతిని ట్రాప్ చేసి కేటుగాళ్లు మోసం చేశారు. ఉద్యోగం కోసం జాబ్ సైట్లలో దరఖాస్తు చేసుకున్న ఆ యువతి మోసపోయింది. పలాన.. డాట్ కామ్ నుండి కాల్ చేస్తున్నామని చెబుతూ మీకు శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో జాబ్ కన్ఫామ్ అయిందని, రూ.లక్షకు పైగా ఫీజు చెల్లించాలని వారు సూచించారు. దీంతో వారి మాటలను నమ్మిన ఆ యువతి ఆన్‌లైన్‌లో లక్ష రూపాయలకు పైగా డబ్బులను పంపించింది. డబ్బులు పంపిన మరుక్షణం నుంచి కేటుగాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వారి చేతిలో నిలువునా మోసపోయానని తెలుసుకుని లబోదిబోమంది. వెంటనే బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవీ కూడా చదవండి

Tragedy: కన్నతల్లే పిల్లల్ని కడతేర్చి, తనూ.. కాటికి చేరింది! అరకులోయలో హృదయవిదారక ఘటన

Guntur : కేటుగాళ్లు ఆటకటించిన పోలీసులు.. అద్దెకు కార్లు తిప్పుతామంటూ తీసుకొని ఆపై..