Guntur : కేటుగాళ్లు ఆటకటించిన పోలీసులు.. అద్దెకు కార్లు తిప్పుతామంటూ తీసుకొని ఆపై..
రోజురోజుకు కేటుగాళ్లు ముదిరిపోతున్నారు. రకరకాల మోసాలతో ప్రజల డబ్బును దోచుకుంటున్నారు. ఇప్పటివరకు రకరకాల మోసాలు చేసే వారిని చూశాం..
Guntur : రోజురోజుకు కేటుగాళ్లు ముదిరిపోతున్నారు. రకరకాల మోసాలతో ప్రజల డబ్బును దోచుకుంటున్నారు. ఇప్పటివరకు రకరకాల మోసాలు చేసే వారిని చూశాం.. ఇక్కడ ఈ ముదురులు కాస్త కొత్తగా ట్రై చేశారు.. చివరకు పోలీసులకు చిక్కారు.. ఇతడు అతడు ఏం చేశారో తెలుసా… అద్దెకు తిప్పడతానంటూ ఓనర్ల దగ్గర కార్లు తీసుకొని ఆతర్వాత ఆ కార్లను తాకట్టుపెట్టుకుంటున్నారు. ఇలా కారు ఓనర్లను బురిడీ కొట్టిస్తున్న కొందరిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంలోని ఐపిడి కాలనీకి చెందిన సాంబశివరావు, నరసింహారావు, రిషి అనే ముగ్గురు చెడు వ్యసనాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నారు. కార్లు కొని అమ్ముతూ జీవించే ఈ ముగ్గురు లాక్ డౌన్ సమయంలో వ్యాపారాలు లేకపోవటంతో ఓనర్ల వద్దకు వెళ్లి కారు మోడల్ బట్టి నెలకు యాభై వేల రూపాయల నుండి లక్ష వరకూ అద్దె వస్తుందని నమ్మించి కార్లను తీసుకెళ్లేవారు.
మొదటి రెండు మూడు నెలల పాటు అద్దె డబ్బులు సక్రమంగా ఓనర్లకు ఇచ్చేవారు. తర్వాత ఆ కార్లను వేరే వ్యక్తులకు అధిక డబ్బులకు తాకట్టు పెట్టేవారని గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. ఇప్పటి వరకు 25 కార్లను తాకట్టు పెట్టి కోటి రూపాయలకు పైగా డబ్బులు తీసుకున్నారు. అయితే జయదీప్ అనే యజమాని వద్ద నుండి తీసుకొన్న కారుని తిరిగి ఇవ్వకపోయేసరికి అనుమానం వచ్చి అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు 21 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :