Tragedy: కన్నతల్లే పిల్లల్ని కడతేర్చి, తనూ.. కాటికి చేరింది! అరకులోయలో హృదయవిదారక ఘటన

విశాఖపట్నం జిల్లా అరకులోయ ప్రాంతంలో ఓ తల్లి తన ముగ్గురు పసి పిల్లలను కడతేర్చి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారకఘటన..

Tragedy: కన్నతల్లే పిల్లల్ని కడతేర్చి, తనూ.. కాటికి చేరింది! అరకులోయలో హృదయవిదారక ఘటన
Tragedy
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 17, 2021 | 7:26 AM

Araku vally: విశాఖపట్నం జిల్లా అరకులోయ ప్రాంతంలో ఓ తల్లి తన ముగ్గురు పసి పిల్లలను కడతేర్చి, అనంతరం తనూ ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారకఘటన చోటుచేసుకుంది. శుక్రవారం మండల కేంద్రంలోని పాత పోస్టాఫీసు కాలనీలో చోటు చేసుకుంది. మండలంలోని శిమిలిగూడ గ్రామానికి చెందిన సంజీవ్(38) సురేఖ(34) భార్య భర్తలు. వీరికి సుసన(10), సర్వీన్(8), సిరీల్(4) అనే ముగ్గురు బిడ్డలు ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరి దాంపత్య జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకోవడంతో గతకొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఉన్నట్లు తెలుస్తుంది.

భార్యాభర్తల మధ్య వాగ్వాదం అధికమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేఖ.. భర్త ఇంట్లో లేని సమయంలో, తన ముగ్గురు పిల్లలకు విషపూరిత ఆహారం పెట్టి కడతేర్చగా, అనంతరం తాను కూడా షీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుంది. మనసుని కలిచివేసే ఈ ఘటనతో మండల కేంద్రంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.

విషయం తెలుసుకున్న అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని, విగత జీవులుగా పడివున్న చిన్నారుల మృతదేహాలను చూసి, చలించి, కన్నీటి పర్యంతమయ్యారు. తదుపరి ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Read also: Rowdy sheeter murder: హైదరాబాద్ పాతబస్తీలో ముస్తాక్ అనే రౌడీ షీటర్ హత్య

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!