Vastu Tips: ఎంత దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నవారైనా సరే.. తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచితే జరిగేది ఇదే..
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తాబేలు బొమ్మ ఉంచడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇది మీ ఇంటికి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మీ కెరీర్‌లో పురోగతి ఉండాలంటే తాబేలును ఉత్తర దిశలో ఉంచాలని చెబుతారు. ఫెంగ్ షుయ్ ప్రకారం కూడా తాబేలు జ్ఞానానికి, సహనానికి దీర్ఘాయువుకు చిహ్నంగా భావిస్తారు. దీని వల్ల ఇంకా ఎన్ని లాభాలంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తాబేలు బొమ్మను ఉంచుకోవడం ఎంతో శుభప్రదమైనది. ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో, వ్యాపారంలో వృద్ధిని సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. భారతీయ సంస్కృతిలో తాబేలుకు ప్రత్యేక స్థానం ఉంది. వాస్తు శాస్త్రంలో దీనిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. హిందూ మతంలో కూడా తాబేలును శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం, విష్ణుమూర్తి కూర్మ అవతారంలో తాబేలు రూపం దాల్చాడు. క్షీరసాగర మథనం సమయంలో మందరాచల పర్వతాన్ని తన వీపుపై నిలిపింది ఈ తాబేలే అని చెబుతారు. అందుకే ఇంట్లో తాబేలు ఉంటే ఆనందం, శ్రేయస్సు శాంతి నెలకొంటాయని ప్రజలు విశ్వసిస్తారు.
ఇంట్లో తాబేలు బొమ్మను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. వ్యాపారంలో విజయం సాధించవచ్చు. అంతేకాదు, ఇది ఇంటికి ఆనందం శ్రేయస్సును కూడా తీసుకువస్తుంది. మీ వ్యాపారం ఇంట్లో అభివృద్ధిని పెంచడానికి తాబేలును ఉంచుకోవడం చాలా మంచిది. జ్యోతిష్య వాస్తు నిపుణులు కూడా తాబేలు బొమ్మ లేదా విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఈ మధ్య చాలా మంది తమ ఇళ్లలో తాబేలు బొమ్మలను పెట్టుకుంటున్నారు. అయితే, దీనిని ఇంట్లో ఏ దిశలో ఎలా ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
తాబేలు ప్రశాంతమైన ఎక్కువ కాలం జీవించే జీవి. మీరు మీ ఇంటి పూజ గదిలో తాబేలు లేదా అష్టధాతువుతో చేసిన తాబేలు చిత్రాన్ని కూడా ఉంచవచ్చు. తాబేలును నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో ఉంచడం చాలా ఉత్తమమని చెబుతారు.
చాలా మంది పండితులు తాబేలును ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలని సూచిస్తారు. తాబేలు బొమ్మను నీటితో నిండిన పాత్రలో ఉంచాలి. ప్రతిరోజూ తాబేలు బొమ్మపై ఒక తులసి దళాన్ని ఉంచడం మంచిది. మీరు పనికి వెళ్లేటప్పుడు తాబేలును చూస్తే, మీ పని విజయవంతమవుతుందని కూడా నమ్ముతారు. తాబేలు ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా సంపద సానుకూల శక్తిని కాపాడుతుందని చెబుతారు.
లోహంతో చేసిన తాబేలు బొమ్మను ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉంచవచ్చని నిపుణులు అంటున్నారు. ఉత్తర దిశలో ఉంచడం వల్ల పిల్లలకు మంచి జీవితం లభిస్తుంది చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. అదే వాయువ్య దిశలో ఉంచితే చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. అందువల్ల, మీరు మీ ఇంట్లో, కార్యాలయంలో లేదా దుకాణంలో తాబేలు బొమ్మను ఉంచుకుంటే, మీ ఇంట్లో శాంతి ఆనందం ఉంటాయని, ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో అభివృద్ధి లభిస్తుందని నమ్ముతారు. అలాగే, మీకు డబ్బు ధాన్యాల కొరత ఎప్పటికీ ఉండదు.