Vastu Tips: మీ వంట గదిలో ఈ వస్తువులను అప్పుగా తీసుకోవద్దు.. సూర్యాస్తమం తర్వాత అప్పుగా ఇవ్వొద్దు..
జ్యోతిష్య శాస్త్రంలో వంట గదికి ప్రత్యేక స్థానం ఉంది. వంట గదిలో వస్తువులు పెట్టుకునే దగ్గర నుంచి వంట కు ఉపయోగించే వస్తువుల వరకూ అనేక నియమాలున్నాయి. వాటిని నిర్లక్షం చేయడం వద్దని సూచిస్తుంది. అంతేకాదు వంటగదిలో కొన్ని వస్తువులు పూర్తిగా అయ్యే వరకూ ఉండరాదని, వాటిని అప్పుగా తీసుకోకూడదు.. అప్పుగా ఇవ్వ వద్దు అని చెబుతోంది. వంటగదిలోని పసుపుతో సహా ఈ మూడు వస్తువులను అప్పుగా ఇవ్వడం వల్ల ఇంటి సభ్యులందరిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని నమ్ముతారు.

ఒకొక్కసారి వంట చేసే సమయంలో కొన్ని వస్తువులు నిండుకుంటాయి. అవి లేక పొతే వంట ఆగిపోతుంది. అప్పుడు ఆ సమయంలో దుకాణానికి వెళ్లేందుకు సమయం దొరకదు. దీంతో అవసరమైన వాటిని పొరుగువారి నుంచి అప్పుగా తీసుకుంటారు. ఇలా అప్పు తీసుకునే అలవాటు నేటికీ భారతీయ సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది. అవసరమైనప్పుడు కొన్ని వస్తువులను ఇరుగు పొరుగు వారి నుంచి తీసుకోవడం తప్పు లేదు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం జీవితంలో మంచి చెడులకు కొన్ని నియమాలను పాటించాలి. కొన్ని సాధారణ విషయాలను జాగ్రత్తగా చూసుకుంటే.. ఇంటి నుంచి ప్రతికూల శక్తిని లేదా ప్రతికూలతను తొలగించవచ్చు. ప్రతి విషయం నిర్వహణ, పర్యవేక్షణ ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వంటగదిలోని కొన్ని వస్తువులు పూర్తిగా అయ్యే వరకూ ఉండకూడదు. అదే సమయంలో కొన్ని వస్తువులను ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అప్పుగా తీసుకోరాదు. ఆ వస్తువులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
ఏ వస్తువులను ఎప్పుడూ అప్పుగా తీసుకోకూడదో తెలుసుకుందాం
పసుపు: పసుపును హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు, పూజలలో అలాగే వివాహాలు వంటి శుభ సందర్భాలలో పసుపుకి ప్రధాన స్థానం ఉంది. తప్పని సరిగా ఉపయోగిస్తారు. అంతేకాదు జ్యోతిషశాస్త్రం ప్రకారం పసుపు బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. ఈ కారణంగా ఎవరికైనా పసుపు అప్పుగా ఇవ్వడం అశుభం . పొరపాటున కూడ పసుపుని అప్పుగా ఇవ్వొద్దు. అదే సమయంలో పసుపుని అప్పుగా తీసుకోవద్దు. ఇలా పసుపుని అప్పుగా తీసుకోవడం వల్ల కెరీర్, వైవాహిక, ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు.
ఉప్పు: ఉప్పు లేని ఆహారం రుచిగా లేనట్లు అనిపిస్తుంది. ఉప్పుకి జ్యోతిష్యం ప్రకారం వంటగదిలో అయిపోకూడదని నమ్ముతారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ ఉప్పు అప్పుగా ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. దీని వల్ల కుటుంబ సభ్యులకు ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు.
పాలు: జ్యోతిషశాస్త్రంలో పాలు చంద్రునితో ముడిపడి ఉన్నాయి. ఈ కారణంగా, సూర్యాస్తమయం తర్వాత పాలు లేదా వాటితో తయారు చేసిన ఏదైనా పదార్ధాలను అప్పుగా ఇవ్వడం శుభప్రదంగా పరిగణించబడదు.
ఉల్లి, వెల్లుల్లి: ఉల్లిపాయ , వెల్లుల్లిని కేతు గ్రహం పాలిస్తుంది. అటువంటి పరిస్థితిలో జ్యోతిష నిపుణుల అభిప్రాయం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయలను అప్పుగా ఇవ్వడం తీసుకోవడం వలన ఇంట్లో సుఖ సంతోషాలు తగ్గుతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు