Rama Navami Wishes: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ రామనవమి విషెస్..!
శ్రీరామనవమి.. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ 6న వస్తోంది. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు భక్తులు శ్రీరాముని భజనలు చేస్తూ ఉపవాసం ఉండి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అయోధ్యలో, రామాలయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. భక్తులు రామచరిత్రను వినిపిస్తూ, రామ నామాన్ని జపిస్తూ భక్తి సాగరంలో మునిగిపోతారు.

శ్రీరామ నవమి రోజున మీరు ఎక్కడున్నా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పండుగ శుభాకాంక్షలను పంచుకోండి. మీకోసం కొన్ని విషెస్‌ను షేర్ చేస్తున్నాం. దీంట్లో ఏవైనా తీసుకోని వెంటనే మీ ప్రియమైన వారికి షేర్ చేసి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే వాట్సాప్, ఫేస్‌బుక్, షేర్‌చాట్ వంటి సోషల్ మీడియాలో అందరికీ ఈ సందేశాలను పంపండి.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే || మీకు మీ కుటుంబానికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే | రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || Happy Sri Rama Navami 2025
శ్రీరామ జయ రామ జయ జయ రామ.. శ్రీరాముడి కృప మీ ఇంటిని ఆనందంతో నింపాలని, అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రాముడి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ధనసమృద్ధి వెల్లివిరియాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
ధర్మ మార్గంలో నడిచినవారికి శ్రీరాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మీరు కూడా మంచి మార్గంలో ముందుకు సాగాలని ఆశిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
శ్రీరామచంద్రుడు తన భక్తులకు ఎల్లప్పుడు రక్షణ కల్పిస్తాడు. ఆయన ఆశీస్సులతో మీ జీవితం సంతోషం, శాంతితో నిండిపోవాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మీ ఇంట్లో సంతోషాలు వెల్లివిరియాలని.. రామ భక్తి మీ జీవితాన్ని కాంతిమయం చేయాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
శ్రీరాముడి ఆశీస్సులతో మీకు సకల శుభాలు కలగాలని, ధర్మ మార్గంలో నడవగల ఆత్మబలం మీకు లభించాలని కోరుకుంటూ రామనవమి శుభాకాంక్షలు.
శ్రీరాముడు పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. ఆయన జీవితం ధర్మానికి నిదర్శనం. ఈ రామనవమి మీ జీవితాన్ని శుభమయం చేయాలని ఆశిస్తూ రామనవమి శుభాకాంక్షలు
శ్రీరామ నామంలో అపారమైన శక్తి ఉంది. ఈ పవిత్ర నామాన్ని నిత్యం జపిస్తూ మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రాముడు ధైర్యానికి, నిజాయితీకి, శాంతికి ప్రతీక. ఆయన బాటలో నడవడానికి మనమందరం కృషి చేద్దాం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీరాముని ఆశీస్సులతో మీ జీవితంలో మంచి ఆలోచనలు, మంచి కర్మలు, మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రామ నామస్మరణలో అపారమైన శక్తి ఉంది. ఈ పవిత్రమైన రోజున రామ నామాన్ని జపిస్తూ మన మనస్సును పవిత్రం చేసుకుందాం. జైశ్రీరామ్ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
రాముడు చూపించిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తే మన జీవితాల్లో శాంతి, ఆనందం, విజయాలు వెల్లివిరుస్తాయి. ఈ రామనవమి మీకు శుభాలను అందించాలని ఆశిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
భక్తితో రాముని సేవ చేస్తే ఆయన్ని సులభంగా చేరుకోవచ్చు. కష్టసుఖాల్లో మనకు మార్గనిర్దేశం చేసే శ్రీరాముని అనుసరిద్దాం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
శ్రీరాముని బోధనలు మన జీవితానికి మార్గదర్శకం. ఆయన కథను చదివి భక్తిని మన మనసులో పెంచుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
శ్రీరాముడి ధర్మాన్ని మనం జీవితంలో ఆచరిస్తే సద్గుణ సంపన్నులం అవుతాం. మంచి మార్గంలో సాగాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
ఈ పవిత్రమైన రోజున రామ భక్తితో జీవనం సాగిద్దాం. భక్తి మార్గంలో నడిచేవారికి రాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
రామ భక్తిలో లీనమై మన జీవితాలను ధర్మమయంగా మార్చుకుందాం. ఈ రామనవమి మీకు శుభాలను అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి