Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ‘మరో మహిళతో మీ భర్త’ అంటూ ఆమె చెప్పిన ఒక్క మాట.. ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది..

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగర్ చౌరస్తా వద్ద ఆదర్శ నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది.

Hyderabad: ‘మరో మహిళతో మీ భర్త’ అంటూ ఆమె చెప్పిన ఒక్క మాట.. ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది..
Suicide
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 17, 2021 | 5:02 PM

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగర్ చౌరస్తా వద్ద ఆదర్శ నగర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. చెప్పుడు మాటల కారణంగా తలెత్తిన వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తి తన ఉసురు తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన భార్య చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శ నగర్‌ కాలనీలో శ్రీశైలం దంపతులు నివసిస్తున్నారు. అయితే, ఇటీవల శ్రీశైలం భార్య పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చిన ఆమెకు.. అదే ఇంట్లో వేరే గదిలో అద్దెకు ఉంటున్న మహిళ లేనిపోని మాటలు చెప్పింది. ఆమె పుట్టింటికి వెళ్లిన సమయంలో శ్రీశైలం వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, శ్రీశైలం మరొక మహిళతో ఉండటం తాను చూశానంటూ చెప్పింది. ఆ మాటలు నమ్మిన శ్రీశైలం భార్య.. తీవ్రమైన కోపంతో రగిలిపోయింది. ఇదే అంశంపై శ్రీశైలంతో గొడవ పడింది. దాంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

అయితే, ఈ ఘర్షణతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీశైలం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య ఇంటి నుంచి కిరాణా షాపు వద్దకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కిరాణా షాప్‌ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన భార్య.. తన భర్త ఉరికి వేలడటాన్ని చూసి షాక్ అయ్యింది. పెద్ద ఎత్తున కేకలు వేసింది. మహిళ కేకలు విన్న స్థానికులు శ్రీశైలం ఇంటికి వచ్చారు. ఫ్యాన్‌కి ఉరి వేసుకున్న శ్రీశైలం బాడీని కిందకు దించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. విషయాన్ని పోలీసులకు తెలుపగా.. వెంటనే వారు ఘటనా స్థలికి వచ్చారు. శ్రీశైలం మృతదేహాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తీసుకున్నారు. శ్రీశైలం ప్రాణాలు కోల్పోవడానికి కారణం చెప్పుడు మాటలే అని నిర్ధారించుకున్న పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శ్రీశైలం మృతికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ రాజేంద్ర నగర్‌ పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, శ్రీశైలం దంపతులకు ఇద్దరు పిల్లు ఉన్నారు.

Also read:

Hyderabad : అసలేం తెలియనట్లుగా మహిళ మృతదేహాన్ని తీసుకువచ్చారు.. ఆపై పరారయ్యారు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!

Fire Accident: రన్నింగ్‌లో ఉన్న లారీకి ఒక్కసారిగా అంటుకున్న మంటలు.. ఆ తరువాత చూస్తుండగానే..

TDP Protest: నెల్లూరు టీడీపీ నేతల సాహసోపేత నిరసన.. కొంచెం పొరపాటు జరిగినా ప్రమాదంలో పడేవారే..!