Fire Accident: రన్నింగ్‌లో ఉన్న లారీకి ఒక్కసారిగా అంటుకున్న మంటలు.. ఆ తరువాత చూస్తుండగానే..

Fire Accident: కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చూస్తుండగానే ఓ లారీ బుగ్గిపాలైంది. డ్రైవర్‌ అప్రమత్తం..

Fire Accident: రన్నింగ్‌లో ఉన్న లారీకి ఒక్కసారిగా అంటుకున్న మంటలు.. ఆ తరువాత చూస్తుండగానే..
Lorry
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 17, 2021 | 4:17 PM

Fire Accident: కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చూస్తుండగానే ఓ లారీ బుగ్గిపాలైంది. డ్రైవర్‌ అప్రమత్తం అవడంతో అతను ప్రాణాలతో బయటపడగలిగాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకెళితే.. దోనబండ కనకదుర్గ క్రషర్స్‌కు చెందిన లారీ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిధిలోని పరిటాల, దోనబండ సరిహద్దు చెక్‌పోస్ట్ సమీపానికి చేరుకుంది. రన్నింగ్‌లో ఉండగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి లారీకి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అది గమనించి వెంటనే అప్రమత్తమైన లారీ డ్రైవర్.. కిందకు దూకేశాడు. దాంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు.

వెంటనే ప్రమాదంపై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీకి అంటుకున్న మంటలను అదుపు చేశారు. మరోవైపు పోలీసులు కూడా అక్కడికి చేరుకుని.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. నడిరోడ్డుపై ఆగిన లారీని క్రేన్ సాయంతో పక్కను జరిపించారు. కాగా, ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ నుంచి సమాచారం సేకరించి.. వివరాలను రికార్డులో నమోదు చేసుకున్నారు.

Also read:

TDP Protest: నెల్లూరు టీడీపీ నేతల సాహసోపేత నిరసన.. కొంచెం పొరపాటు జరిగినా ప్రమాదంలో పడేవారే..!

New Innovation: మీ ఇంట్లో ఈ పేపర్ ఉంటే చాలు.. ఏసీలు అవసరమే లేదు.. అద్భుతమైన ఆవిష్కరణ వచ్చేసింది..

Viral News : పెంపుడు కుక్కతో సరదాగా ఆడాడు.. మాంచి స్పీడ్‌మీదున్న ఆ కుక్క యజమాని పూసాలు కదిలించింది..