New Innovation: మీ ఇంట్లో ఈ పేపర్ ఉంటే చాలు.. ఏసీలు అవసరమే లేదు.. అద్భుతమైన ఆవిష్కరణ వచ్చేసింది..
New Innovation: ఏసీలకు ఇక గుడ్ బై చెప్పేయండి.. మీ ఇంట్లో ఈ కూలింగ్ పేపర్ ఉంటే చాలు.. కరెంట్ కూడా అక్కర్లేదు.. మీ ఇల్లు చల్లచల్లగా..
New Innovation: ఏసీలకు ఇక గుడ్ బై చెప్పేయండి.. మీ ఇంట్లో ఈ కూలింగ్ పేపర్ ఉంటే చాలు.. కరెంట్ కూడా అక్కర్లేదు.. మీ ఇల్లు చల్లచల్లగా.. కూల్ కూల్ అయిపోతుంది. ఎయిర్ కండీషర్లు అయితే కరెంట్ అవసరం అవుతుంది. పైగా కరెంట్ బిల్లు కూడా భారీగానే వస్తుంది. ఒకవేళ కరెంట్ పోతే.. ఏసీ పనిచేయదు. అందుకే.. ఇలాంటి సమస్య లేకుండా ఉండేలా ఓ కొత్త మెటేరియల్ కనుగొన్నాడో సైంటిస్టు. అదే… రూఫింగ్ మెటీరియల్. దీని గురించి తెలిస్తే షాక్ అవుతారు.
ఈ కూలింగ్ పేపర్ మెటీరియల్.. సూర్య కిరణాల నుంచి ఉత్పన్నమయ్యే వేడిని లాగేసుకుంటుంది. ఇంటి భవనాల్లో ఉండే ఉష్ణోగ్రత స్థాయిలను పూర్తిగా సంగ్రహించుకుంటుంది. తద్వారా మీ ఇల్లంతా చల్లచల్లగా మారిపోతుంది. దీనిని రీసైకిల్ పేపర్ నుంచి తయారుచేశారు. ఈ కూలింగ్ పేపర్ ఇంటిపైన సెట్ చేసుకుంటే హీట్ లాగేసుకుని ఇంటిని ఎప్పుడూ చల్లగా ఉంచుతుందట. ఈ కూలింగ్ పేపర్ ఇంట్లో ఉంటే.. ఏసీతో పాటు కరెంట్ కూడా అక్కర్లేదంటున్నారు.. నార్త్ ఈస్టరన్ యూనివర్శిటీకి చెందిన మెకానికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అసొసియేట్ ప్రొఫెసర్ ఇ జెంగ్. అంతేకాదు.. ఈ కూలింగ్ పేపర్ 100శాతం రీసైక్లింగ్ చేయొచ్చంటున్నారు. ఇది ఏసీల కంటే కూడా గది ఉష్టోగ్రతను 10 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు తగ్గిస్తుందట. కూలింగ్ పేపర్ రీసైక్లింగ్ చేసినప్పటికీ తన కూలింగ్‌ను కోల్పోలేదని జెంగ్ తెలిపారు.
అమెరికాలో ఏసీలులేని ఇళ్లు దాదాపు ఉండవనే చెప్పాలి. 87శాతం ఇళ్లల్లో ఏసీలు ఉంటాయి. ఏడాదికి ఒక్కో ఇంటికి 265 డాలర్లు ఖర్చు కూడా అవుతుంది. కొన్ని ఇళ్లల్లో రెండు నుంచి మూడు ఏసీలు వాడుతుంటారు. ఒకవైపు గ్లోబల్ టెంపరేచర్లు పెరిగిపోవడంతో ఏసీలను ఆశ్రయించక తప్పడంలేదు. భారత్ వంటి అభివృద్ధిచెందుతున్న దేశాల్లోని మధ్య తరగతి వాళ్లు కూడా ఏసీలను ఉపయోగిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం చైనాలో కొంతమంది మాత్రమే.. అది కూడా పట్టణ ప్రాంతాల్లోని వారి ఇళ్లలోనే ఏసీలు ఉండేవి. కానీ, ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లల్లో ఏసీలు నిండిపోయాయి. ఏసీలతో వచ్చే సమస్య ఏంటంటే.. ఖరీదు ఎక్కువ.. టన్నుల కొద్ది పవర్ కావాలి. గాలి కాలుష్యంతో పాటు గ్లోబల్ వార్మింగ్ కూడా కారణమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ న్యూ ఇన్నోవేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
Also read:
Viral News : పెంపుడు కుక్కతో సరదాగా ఆడాడు.. మాంచి స్పీడ్‌మీదున్న ఆ కుక్క యజమాని పూసాలు కదిలించింది..