South Central Railway: ప్రయాణికులకు శుభవార్త.. 19వ తేదీ నుంచి సాధారణ రైళ్లన్నీ పునరుద్ధరణ.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరిస్తున్న ప్రకటించింది.
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా రద్దైన సాధారణ రైళ్లను పునరుద్ధరిస్తున్న ప్రకటించింది. ఈనెల 19వ తేదీ నుంచి సాధారణ రైళ్లన్నీ పట్టాలెక్కనున్నాయని ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 82 ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అలాగే 16 ఎక్స్‌ప్రెస్ స్పెషల్ సర్వీస్, 66 ప్యాసింజర్ స్పెషల్ సర్వీసులను కూడా పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. కర్ణాటక రాయచూరు వరకు రైళ్లు నడపున్నట్లు తెలిపింది. అయితే, సాధారణ రైళ్లను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు కీలక సూచనలు జారీచేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికులు కచ్చితంగా మాస్కులు ధరించాలంది. భౌతిక దూరం పాటించాలని సూచించింది. చేతులను శానిటైజర్‌తో శుభ్రపరచుకోవాలని పేర్కొంది.
కాగా, కరోనా వైరస్ కారణంగా సాధారణ రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రయాణికుల సౌలభ్యం కోసం కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రం నడుపుతోంది. ప్రస్తుతం దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి దాదాపుగా తగ్గుముఖం పట్టడంతో సాధారణ రైళ్ల ప్రయాణాలను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. సౌత్ సెంట్రల్ రైల్వే తాజా ప్రకటనతో సుమారు 16 నెలల తరువాత సాధారణ రైళ్లు పట్టాలపైకి ఎక్కబోతున్నాయి.
82 Express/Passenger Spl Services Restored with Revised Train Numbers @drmgtl @drmned @drmhyb @drmsecunderabad @drmgnt @drmvijayawada pic.twitter.com/wMQaw0EsdU
— South Central Railway (@SCRailwayIndia) July 16, 2021
Also read: