Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు కీలక సూచనలు చేసిన సీఎం కేసీఆర్..

CM KCR: సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీతో..

CM KCR: ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు కీలక సూచనలు చేసిన సీఎం కేసీఆర్..
Cm Kcr
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 16, 2021 | 10:22 PM

CM KCR: సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారు. సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరనివ్వకూడదని ఎంపీలకు సీఎం కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. శుక్రవారం నాడు ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్ర వాటాపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటాకోసం కేంద్రాన్ని నిలదీయాలని, గట్టిగా కొట్లాడాలని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు.

విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని సీఎం తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలను అందచేయాలని ఎంపీలకు సీఎం సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన సివిల్ సప్లయ్ శాఖ సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలువాలని పార్టీ పార్లమెంట్ సభ్యులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కాగా, ఈ సమావేశంలో.. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కే.కేశవరావు, లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కెఆర్ సురేశ్ రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also read:

South Central Railway: ప్రయాణికులకు శుభవార్త.. 19వ తేదీ నుంచి సాధారణ రైళ్లన్నీ పునరుద్ధరణ.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Mobiles: ఆపిల్‌ సంస్థకు షియోమీ షాక్‌.. ఆపిల్‌ని వెనక్కి రెండో స్థానాన్ని ఆక్రమించేసింది.. మొదటి స్థానం ఏ కంపెనీ అంటే..

Elephant: ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఏనుగుల ముందుకెళ్లారు.. ఆ తరువాత లుంగీ చేతపట్టి పరుగులు తీశారు.. ఫన్నీ వీడియో..