AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP Protest: నెల్లూరు టీడీపీ నేతల సాహసోపేత నిరసన.. కొంచెం పొరపాటు జరిగినా ప్రమాదంలో పడేవారే..!

TDP Protest: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ విపక్ష నేతలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేయడం సహజం.

TDP Protest:  నెల్లూరు టీడీపీ నేతల సాహసోపేత నిరసన.. కొంచెం పొరపాటు జరిగినా ప్రమాదంలో పడేవారే..!
Agitation
Shiva Prajapati
|

Updated on: Jul 17, 2021 | 3:30 PM

Share

TDP Protest: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ విపక్ష నేతలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేయడం సహజం. అయితే, ఆ నిరసన సెగ ప్రభుత్వానికి తాకేలా ఉండాలి కానీ.. ఇక్కడ టీడీపీ నేతలు తమకే ఆ సెగ అంటుకునేలా సాహసోపేత నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన విధానం చూసి అంతా షాక్ అయ్యారు. ఏమాత్రం తేడా వచ్చినా నిరసనలో పాల్గొన్న కార్యకర్తల అందరి ప్రాణాలు ప్రమాదంలో పడేవే. ఇంతకీ ఏం జరిగిందంటే..

Tdp 1

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరులో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలోని పార్టీ కార్యకర్తలు వినూత్న రీతిలో, కాస్తంత సాహసోపేతమైన పద్ధతిలో నిరసన చేపట్టారు. నెల్లూరు పట్టణంలో రద్దీగా ఉండే గాంధీబొమ్మ సెంట‌ర్ లో గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్త తరహా పోరాటానికి తెర లేపారు. రోడ్డుపై వలయాకారంలో నిలుచుకున్న పార్టీ శ్రేణులు.. తమ చుట్టూ గుండ్రంగా మంటలు అంటించుకున్నారు. ఆ మంట మధ్యలో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మంటల నుంచి ప్రజలను కాపాడాలంటూ నినదించారు. దట్టమైన పొగ, మంటలు పైకి వస్తున్నా.. ఏమాత్రం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆందోళనను కొనసాగించారు. సుమారుగా 15 నిమిషాల పాటు చుట్టూ మంటలు వేసుకుని మంటల మధ్యలో కోటంరెడ్డి సహా, ఇతర కార్యకర్తలు నిల్చున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. అనుభవం లేని తుగ్లక్ పాలన వల్లే రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజీల్ ధ‌ర‌లు పెరుగుతూ ఉంటే.. మ‌రోవైపు ఇంటి ప‌న్నులు పెంచి ప్రజ‌ల‌పై పిడుగులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో సామాన్యులు చితికిపోతున్నారని అన్నారు. పెట్రోల్ రూ. 108, డీజీల్ రూ. 101, ప‌ప్పు దినుసుల ధ‌ర‌లు ఆకాశనంటుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దుక్కి దున్నుకోవాల‌న్నా.. డీజీల్ ధ‌ర‌లు మండిపోవ‌డంతో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారని అన్నారు.

Tdp 2

చంద్రబాబు నాయుడు ఇంటి పన్నులు గానీ, నిత్యావ‌స‌ర వ‌స్తువులు గానీ ఒక్క పైసా కూడా పెంచ‌లేదని.. నాటి టీడీపీ ప్రభుత్వ పాలనా విధానాలను కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గుర్తు చేశారు. అవినీతి మంత్రి అనీల్ పెన్నా ఇసుక‌ను రూ. 100 కోట్లకు అమ్ముకుంటున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. గ్రావెల్ కూడా అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. స‌ర్వేప‌ల్లి కాలువ‌ పేరుతో కోట్లు దోచుకున్నారని అన్నారు. తాము గెలిస్తే ఒక్క రూపాయి కూడా ప‌న్ను వెయ్యమ‌ని చెప్పిన మంత్రి అనీల్.. ఇప్పుడు ఎందుకు నోరు మెద‌ప‌డంలేదని ప్రశ్నించారు. సామాన్య ప్రజ‌ల‌పై పిచ్చి ముఖ్యమంత్రి పిడుగులు వేసి రాక్షసానందం పొందుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఉండే మంత్రుల్లో ఒక‌రేమో జిప్ మంత్రి.. మ‌రొక‌రేమో బూతుల మంత్రి.. ఇంకొకరేమో సైకో మంత్రి.. అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మంత్రులను రాజ‌కీయాల్లో తానెప్పుడూ చూడలేదన్నారు.

Tdp3

ఇదిలాఉంటే.. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు చేపట్టిన నిరసన విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సాహసోపేత నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలకే ముప్పు కలిగేలా ఈ నిరసన ఉంది. కాగా, ఈ నిరసనపై ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. నిరసన బాధ్యతాయుతంగా ఉండాలని, బలి అయ్యేలా ఉండకూడదంటూ సూచిస్తున్నారు.

TDP Protest Video:

Also read:

VIRAL VIDEO : వేదికపై వరుడు, వధువుల డ్యాన్స్..! మామూలుగా లేదుగా.. వైరల్ అవుతున్న వీడియో..

Inspiring Story: కొడుకు మరణం.. పిల్లల్ని వదిలేసిన తల్లి.. మనవళ్ల చదువుకోసం 100 ఏళ్ల తాత కష్టం.. కన్నీటి మయం

Vijay Mallya : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వాటాలను అమ్మి 792 కోట్లను ఎస్బీఐ కన్సార్టియంకు అప్పచెప్పిన ఈడీ!

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...