Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL VIDEO : వేదికపై వరుడు, వధువుల డ్యాన్స్..! మామూలుగా లేదుగా.. వైరల్ అవుతున్న వీడియో..

VIRAL VIDEO : వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఎన్నో మధురానుభూతులను మిగుల్చుతుంది.

VIRAL VIDEO : వేదికపై వరుడు, వధువుల డ్యాన్స్..! మామూలుగా లేదుగా.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video
Follow us
uppula Raju

|

Updated on: Jul 17, 2021 | 3:10 PM

VIRAL VIDEO : వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ఎన్నో మధురానుభూతులను మిగుల్చుతుంది. అందుకే ఎవరైనా సరే ఉన్నంతలో వివాహం హుందాగా చేసుకోవడానికి ఇష్టపడుతారు. ఈ వేడుకలో ఎన్నో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. అందులో కొన్ని ఎప్పటికీ గుర్తుండిపోతాయి. తాజాగా స్టేజ్‌పై వరుడు, వధువుల డ్యాన్స్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో 2020 వివాహానికి సంబంధించినది. వివాహ వేడుకలో భాగంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల ఇష్టానుసారంగా పెళ్లి వేదికపై వరుడు, వధువు డ్యాన్స్ చేయడానికి సిద్దమవుతారు. దీంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోతుంది. DJ లో ‘తుజ్కో హాయ్ దుల్హాన్ బనాంగా’ అనే ఓల్డ్ హిందీ సాంగ్ ప్లే చేయగా మెరిసే నీలిరంగు సూట్ ధరించిన వరుడు డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు. సంప్రదాయ లెహెంగా-చోలి, బంగారు ఆభరణాలు ధరించిన వధువు మెల్లగా అతడితో స్టెప్ కలుపుతుంది.

దీంతో అందరు చప్పట్లు, ఈలలతో స్టేజ్ మార్మోగుతుంది. అంతేకాదు వారు డ్యాన్స్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆనందంతో కరెన్సీ నోట్లను చేతులతో పైకి పెడుతూ ఉంటే ఒకరు వాటిని తీసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను నెటిజన్లు తెగ ఇష్టపడుతారు. మళ్లీ మళ్లీ చూస్తారు. అంతేకాదు లైకులతో హుషారెత్తిస్తారు. షేర్, కామెంట్ చేస్తూ స్పందిస్తారు. ఇంటర్నెట్‌లో ఇలాంటి వీడియోలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రతిరోజు ఎన్నో వైరల్ వీడియోలు నెటిజన్లను అలరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో కూడా అలాగే తెగ వైరల్ ‌గా మారుతోంది.

కొడుకు మరణం.. పిల్లల్ని వదిలేసిన తల్లి.. మనవళ్ల చదువుకోసం 100 ఏళ్ల తాత కష్టం.. 200 కేజీల బండి లాగుతున్న వైనం

Vijay Mallya : కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వాటాలను అమ్మి 792 కోట్లను ఎస్బీఐ కన్సార్టియంకు అప్పచెప్పిన ఈడీ!

‘చట్టం చేతులు చాలా పెద్దవి’..నిజమే ! యూపీలో క్రిమినల్ చేతిని పట్టుకుని పోలీసుల ‘బైక్ రైడింగ్’ !