AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Story: కొడుకు మరణం.. పిల్లల్ని వదిలేసిన తల్లి.. మనవళ్ల చదువుకోసం 100 ఏళ్ల తాత కష్టం.. కన్నీటి మయం

100 Year Oldman Harbans Singh: ప్రస్తుత కాలంలో కొంతమంది బాధ్యతలు ఎక్కడ మోయాలో అని బంధాలను కూడా పక్కకు పెట్టేస్తుంటే.. మరికొందరు వయసుని లెక్కచేయకుండా వయసు మించి..

Inspiring Story: కొడుకు మరణం.. పిల్లల్ని వదిలేసిన తల్లి.. మనవళ్ల చదువుకోసం 100 ఏళ్ల తాత కష్టం..  కన్నీటి మయం
Harban Singh
TV9 Telugu Digital Desk
| Edited By: Surya Kala|

Updated on: Jul 17, 2021 | 3:14 PM

Share

100 Year Oldman Harbans Singh: ప్రస్తుత కాలంలో కొంతమంది బాధ్యతలు ఎక్కడ మోయాలో అని బంధాలను కూడా పక్కకు పెట్టేస్తుంటే.. మరికొందరు వయసుని లెక్కచేయకుండా వయసు మించి బాధ్యతలను మోస్తూ.. బాధ్యతలను నిలబెట్టుకుంటారు. హార్బన్స్ సింగ్ శతాధిక వృద్ధుడు. అయినప్పటికీ రోజూ బతుకుతెరువు కోసం బండి లాగు తాడు.. ఈ 100 ఏళ్ల తాజ జీవిత కథ కన్నీటి మయం. తన మనవడు, మనవరాలు చదువుకోవడానికి కూర్చుకుని తినాల్సిన ఈ వయసులో కూడా ఉల్లిపాయలు, బంగాళా దుంపల బండిని లాగుతున్నాడు. హార్బన్స్ సింగ్ కొడుకు మరణించాడు.. కన్న తల్లి తనకు సంబంధం లేదంటూ పిల్లలిద్దరినీ వదిలి వెళ్ళిపోయింది. అయితే తాత తన వల్ల కాదని మనవడిని, మనవరాలిని వదిలెయ్యలేదు.. తన వయసుని లెక్కచేయకుండా ఉల్లిపాయల బండిని లాగుతున్నాడు. ఆ బండి ఒకొక్కసారి 100 కేజీల నుంచి రెండు వందల కేజీల వరకూ ఉంటుంది. హార్బన్స్ సింగ్ రెండో కుమారుడు పండ్ల వ్యాపారి.. అయితే తండ్రి నుంచి ఎప్పుడో విడిపోయాడు.

హార్బన్స్ సింగ్ దశాబ్దాలుగా కూరగాయలను అమ్ముతూనే ఉన్నాడు. భారత దేశం పాకిస్తాన్ లు విడిపోక ముందు.. హార్బన్స్ సింగ్ 18 ఏళ్ల నుంచి మాన్యువల్ లోడర్ గా పనిచేశాడు. దేశ విభజన చేసిన సమయంలో అతను లాహోర్ లో సారాయ్ థానే వాలీ గ్రామం లో నివసించేవారు. అప్పుడు ఈ తాత కు 27 ఏళ్ళు. దేశ  విభజన తర్వాత హార్బన్స్ సింగ్ ఫ్యామిలీ  పంజాబ్ రాష్ట్రానికి చేరుకున్నాడు. కూరగాయలు అమ్మడం మొదలు పెట్టాడు. కూరగాయల బండిని అమృతసర్ రహదారి మీద కొన్ని కిలోమీటర్లు లాగి తీసుకుని వెళ్తున్నాడు. తన ఇద్దరి కుమారుల్లో ఒకరు మరణించినా ఆ కుమారుడి బాధ్యతను బరువు అనుకోకుండా తన కష్టాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా పని చేస్తున్న ఈ హార్బన్స్ సింగ్ తాత పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తాను మరణానికి భయపడను కానీ.. నేను మరణిస్తే.. నా మనవళ్లను చూసేది ఎవరు అని కన్నీరు పెట్టుకున్నాడు హార్బన్స్ సింగ్ తాత.

Also Read: గుడ్డుతో వెరైటీ స్నాక్స్ రెసిపీ .. స్వీట్ కార్న్ , క్యారెట్ తో ఆమ్లెట్ తయారీ విధానం

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..